- సెగ్మెంట్‌లో ఏడీఏఎస్(అడాస్)ని పొందిన మొదటి కారుగా నిలిచిన హ్యుందాయ్ వెన్యూ
- జనవరిలో సెల్టోస్ ధరలను ప్రకటించనున్న కియా కంపెనీ
2023 ప్రారంభంలో సబ్-4-మీటర్ సెగ్మెంట్ లో వచ్చిన వెన్యూలో మొత్తానికి ఏడీఏఎస్(అడాస్)ను చేర్చి చిన్న అప్‍డేట్ ను పొందుపర్చింది. ఇప్పుడు దానిని పోలి ఉండే కారు ఏదైనా ఉంది అంటే అది కియా సోనెట్ అని చెప్పవచ్చు. జనవరి ప్రారంభంలో జరిగే అధికారిక లాంచ్ లో కియా సోనెట్ ఏడీఏఎస్(అడాస్) ఫీచర్లతో రానుంది. ఇప్పుడు మనం ఇందులో ఒకే విధంగా ఉన్న మరియు భిన్నమైన ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
చిన్న క్లూ: నిజం చెప్పాలంటే ఈ రిజల్ట్స్ మిమ్మల్ని పెద్దగా ఆశ్చర్యపరిచేలా ఏమి ఉండవు.
కియా సోనెట్ | హ్యుందాయ్ వెన్యూ | ||
ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ కార్ | ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ కార్ | ||
ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ పెడెస్ట్రియన్ | ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ పెడెస్ట్రియన్ | ||
ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ సైక్లిస్ట్ | ఫార్వర్డ్ కొలిజన్ అవాయిడెన్స్ సైక్లిస్ట్ | ||
లేన్ డిపార్చర్ వార్నింగ్ | లేన్ డిపార్చర్ వార్నింగ్ | ||
హై బీమ్ అసిస్ట్ | హై బీమ్ అసిస్ట్ | ||
లేన్ కీప్ | లేన్ కీప్ | ||
లేన్ ఫాలో | లేన్ ఫాలో | ||
లీడ్ డిపార్చర్ | లీడ్ డిపార్చర్ | ||
డ్రైవర్ అటెన్షన్ | డ్రైవర్ అటెన్షన్ |
పరిశీలన:
ఫీచర్స్ మరియు వీటిని ఆపరేట్ చేసే విధానాన్ని బట్టి రెండింటిలో ఏడీఏఎస్(అడాస్) ప్యాకేజీ ఒకేలా ఉండనుంది. ఈ రెండింటిలో పెద్ద తేడా ఏంటి అంటే, వెన్యూను SX (O) మరియు N-లైన్ N8 వేరియంట్లలో పొందవచ్చు, ఇంకా సోనెట్ ను ఒకే ఒక్క ఫుల్లీ లోడెడ్ X-లైన్ వేరియంట్లో మాత్రమే పొందవచ్చు. మొత్తానికి సెల్టోస్ డెవలప్ అయిన విధానాన్ని చూస్తే, సోనెట్ లాంచ్ అయ్యాక కొన్ని రోజుల తర్వాత కనీసం ఒకటి తక్కువ స్పెసిఫికేషన్స్ ఉన్న వేరియంట్ ఉంటుందని మేము తెలుసుకున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్