- బేస్ వేరియంట్ గా వచ్చిన కొత్త ఎంటి టర్బో
- మెరుగైన ఫీచర్లను అందుకున్న మిడ్-స్పెక్ S(O) వేరియంట్
కొత్త వేరియంట్
హ్యుందాయ్ వెన్యూ ఎగ్జిక్యూటివ్ అనే కొత్త బేస్-స్పెక్ టర్బో ఎంటిని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇది బేస్ వేరియంట్ లో అందుబాటులోకి రాగా, మిడ్-స్పెక్ వేరియంట్ S (O) ధర దీని కంటే రూ. 40,000 ఎక్కువగా ఉంది.
ఫీచర్ లిస్టులో భాగంగా ఈ కొత్త వేరియంట్ ఆరు ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, 8-ఇంచ్ డిస్‌ప్లేతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టూ-స్టెప్ రిక్లైనింగ్ రియర్ సీటు, స్టోరేజ్‌తో కూడిన డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్, క్రూయిజ్ కంట్రోల్, ఈఎస్‍పీ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ ని పొందింది. కనిపించే మార్పుల పరంగా చూస్తే, హ్యుందాయ్ కంపెనీ ఈ కారు వెనుక భాగంలో ఎగ్జిక్యూటివ్ లోగోని తీసుకురాగా, ఇదే ఇందులో అతి పెద్ద అప్‍డేట్ అని చెప్పవచ్చు. ఇంజిన్ గురించి చెప్పాలంటే, హ్యుందాయ్ కంపెనీ ఇందులో 118bhp/172Nm టార్కును ఉత్పత్తి చేసే 1.0-లీటర్ 3-సిలిండర్ జిడిఐ టర్బో ఇంజిన్ ని తీసుకువచ్చింది. ఈ ఇంజిన్ ఐడిల్ స్టాప్-అండ్-గో ఫీచర్ ని స్టాండర్డ్ గా పొందింది.
S(O) వేరియంట్ అప్‍డేట్స్
ఇంకా చెప్పాలంటే, హ్యుందాయ్ కంపెనీ వెన్యూ S(O) వేరియంట్ ని అప్‍డేట్ చేయగా, ఈ అప్‍డేట్ లో అదనపు ఎలక్ట్రిక్ సన్ రూఫ్, మరియు డ్రైవర్ మరియు ప్యాసింజర్స్ కోసం మ్యాప్ ల్యాంప్స్ ని తీసుకువచ్చింది. ఈ అప్‍డేటెడ్ హ్యుందాయ్ వెన్యూ S(O) యొక్క 6-స్పీడ్ మాన్యువల్ వెర్షన్ రూ.10.75 లక్షల ఎక్స్-షోరూం ధరతో మరియు 7-స్పీడ్ డిసిటి వెర్షన్ రూ.11.85 లక్షల ఎక్స్-షోరూం ధరతో అందుబాటులో ఉంది.
అధికారిక స్టేట్‍మెంట్
ప్రకటనపై హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, సీఓఓ, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, 'హ్యుందాయ్ ఇండియాను 'లివ్ ది ఎస్‍యూవీలైఫ్'గా మార్చింది. మేము మా ఎస్‍యూవీలతో ముందుకు కొనసాగుతూ, హ్యుందాయ్ వెన్యూ యొక్క ఎగ్జిక్యూటివ్ టర్బో వేరియంట్‌ను ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ వేరియంట్ థ్రిల్లింగ్ పెర్ఫార్మెన్స్ ని అందిస్తూ,వాల్యూ-కాన్షియస్ ద్వారా కొత్తగా కొనుగోలు చేస్తున్న కొనుగోలుదారునికి కూడా మరింత సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యుందాయ్ వెన్యూ యొక్క ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌ను ఇప్పుడు ఇండియాలో ప్రవేశపెట్టడం ద్వారా ఇండియన్స్ కి హ్యుందాయ్ ఎస్‍యూవీలపై మక్కువ మరింత పెరుగుతుందని మేము విశ్వసిస్తున్నాము.” అని పేర్కొన్నారు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్