- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే లభ్యం
- S (O) వేరియంట్ కంటే రూ.11,000 అధికం
హ్యుందాయ్ కంపెనీ వెన్యూ కారులో ఎన్నో వేరియంట్లను తీసుకువచ్చింది. వీటికి అదనంగా నేడు వెన్యూ కారులో సన్ రూఫ్ చేర్చి కొత్తగా S+ వేరియంట్ ని తీసుకువస్తూ, రూ.9.35 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ చేసింది. ఇది ఒకే వేరియంట్ లో అందుబాటులోకి రాగా, 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే అందించబడింది.
వెన్యూ కారులోని S+ వేరియంట్లో అందించబడిన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో కలర్ మల్టీ ఇంస్ట్రుమెంట్ డిస్ ప్లేతో డిజిటల్ క్లస్టర్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్‌ప్లేతో 8.0-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మరియు రియర్ ఏసీవెంట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో అందించిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 82bhp/114Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేసి పొందవచ్చు.
మీకు సన్‌రూఫ్ కావాలంటే,ఈ సన్‌రూఫ్ ఎనేబుల్డ్ వెర్షన్ రెగ్యులర్ S (O) వేరియంట్ కంటే కేవలం రూ. 11,000 మాత్రమే అధిక ధరను కలిగి ఉంది. సన్‌రూఫ్ ఎనేబుల్డ్ వెర్షన్‌కు వెళ్లేంత ఎక్కువ బడ్జెట్ మీతో లేకపోతే మీరు రెగ్యులర్ S (O) వేరియంట్ ని కొనుగోలు చేయవచ్చు. ఇంకా దీనీతో పోటీపడే కార్ల అంశానికి వస్తే, మేజర్ అప్ డేట్ల పరంగా వెన్యూ మోడల్ చాలా పాతది. అయినప్పటికీ ఇది ఇతర కార్లతో పోటీగా బెస్ట్ ఫీచర్లతో అందించబడింది అని చెప్పవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్