- ఇండియాలో రూ. 7.94లక్షలతో ప్రారంభమైన వెన్యూ ధరలు
- ఈ రేంజ్ లోకి ఇటీవల జతచేయబడిన ఎగ్జిక్యూటివ్ ఎడిషన్
దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు దాని రేంజ్ లో కొన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో అందుబాటులో ఉంటాయి.
మార్చి లో, హ్యుందాయ్ వెన్యూని రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ తో పొందవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే, కొరియన్ కార్ మేకర్ నుండి వచ్చిన సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువిపై డిస్కౌంట్‌ను అందించడం ఇది రెండవ సారి.
గత వారం, హ్యుందాయ్ ఇండియా వెన్యూ ఎగ్జిక్యూటివ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇది ప్రత్యేకంగా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఎంటి టైప్ లో లభిస్తుంది, దీనిని రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే ఇది అదనపు ఫీచర్స్ రేంజ్ ని కూడా పొందుతుంది. ఇప్పుడు ఇది టర్బో మ్యాట్రిక్స్లో S(O) టర్బో ఎంటి కంటే తక్కువలో వచ్చిన కొత్త ఎంట్రీ-లెవల్ వేరియంట్.
అనువాదించిన వారు: రాజపుష్ప