- వెన్యూ S(O) ప్లస్ వేరియంట్లో సన్ రూఫ్ ని చేర్చిన హ్యుందాయ్
- మాన్యువల్ గేర్ బాక్సుతో అందించబడుతున్న హ్యుందాయ్ వెన్యూ
హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు దాని ఎన్నో మోడళ్లలో సన్ రూఫ్ ని తీసుకువస్తుంది. అయితే లేటెస్టుగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెఎంఐఎల్) ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వెన్యూలో కొత్త వేరియంట్‌ను లాంచ్ చేసింది. హ్యుందాయ్ వెన్యూ కొత్త S(O)+ వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో రాగా, దీనిని రూ. 9.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో పొందవచ్చు. ఇప్పుడు ఈ వెన్యూ S(O)+ వేరియంట్ S(O) వెర్షన్ లో ఉన్న అన్ని ఫీచర్లతో రానుండగా, ఎలాంటి అదనపు ఫీచర్లు కూడా కొత్త వేరియంట్లో అందించబడలేదు.
కొత్త హ్యుందాయ్ వెన్యూ S(O)+ వేరియంట్ ఇప్పుడు వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లేకు సపోర్ట్ చేసే 8-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఎల్ఈడీడీఆర్ఎల్స్, ఎల్ఈడీప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లతో పాటుగా అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (పనోరమిక్ కాదు) తో వచ్చింది. సేఫ్టీ ఫీచర్ల పరంగా, ఇది రియర్ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్, టిపిఎంఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్-స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్లను పొందింది.
వెన్యూ S(O)+ పవర్ ట్రెయిన్ ఆప్షన్స్
వెన్యూ ఎస్‍యూవీలోని కొత్త S(O)+ వేరియంట్లో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ కప్పా పెట్రోల్ ఇంజిన్ అందించబడింది. ఇది కేవలం మాన్యువల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే లభిస్తుంది. అలాగే, ఈ కారులోని టర్బో పెట్రోల్ S(O) వేరియంట్ కూడా ఈ అప్ డేట్ ని అందుకుంటుందా లేదా అనే సమాచారం కోసం మేము కూడా ఎదురుచూస్తున్నాం.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్