- ఇందులో అందుబాటులో ఉన్న ఏడీఏఎస్ సేఫ్టీ సూట్
- అందుబాటులోకి రానున్న 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్
హ్యుందాయ్ 2023 ఇటరేషన్ కి సంబంధించిన వెన్యూ ఎన్ లైన్ ని గత నెల సెప్టెంబర్ 4న లాంచ్ చేసింది. తాజా అప్ డేట్స్ లో ఏముంది అంటే, ఈ ఆటోమేకర్ వెన్యూ ఎన్ లైన్ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కి ఏడీఏఎస్ టెక్నాలజీతో పాటు 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ని కూడా జత చేసింది. దీంతో ఇప్పుడు ఆ మోడల్ ధర ఒకేసారి రూ.7,800 వరకు పెరిగింది.
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ని రెండు వేరియంట్స్ లో పొందవచ్చు. అవి ఏంటి అంటే, N6 మరియు N8, వీటిలో రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. అయితే, ఇందులో N6 వేరియంట్ పై మాత్రమే ధర పెరిగింది, N8 వేరియంట్ ధరపై ఎలాంటి మార్పు లేదు.
2023లో ముఖ్య భాగమైన వెన్యూ ఎన్ లైన్ 1.0 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో 118bhp మరియు 172Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది మరియు అదే విధంగా ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్ తో జత చేయబడి ఉంది.
వేరియంట్స్ వారీగా ఎస్‍యువి యొక్క అప్ డేటెడ్ ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ఎక్స్-షోరూం ధరలు |
N6 ఎంటి | రూ. 12,07,700 |
N6 ఎంటి డ్యూయల్ టోన్ | రూ. 12,22,700 |
N6 డిసిటి | రూ. 12,87,300 |
N6 డిసిటి డ్యూయల్ టోన్ | రూ. 13,02,300 |
N8 ఎంటి | రూ. 12,95,900 |
N8 ఎంటి డ్యూయల్ టోన్ | రూ. 13,10,900 |
N8 డిసిటి | రూ. 13,74,800 |
N8 డిసిటి డ్యూయల్ టోన్ | రూ. 13,89,800 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్