- ఇండియాలో న్యూ వెన్యూ ధరలు రూ. 7.77 లక్షలు నుండి ప్రారంభం
- 7 కలర్స్ మరియు 6 వేరియంట్స్ లో లభ్యం
మేము వివిధ హ్యుందాయ్ మోడల్స్ కి సంబంధించిన అప్‌డేటెడ్ వెయిటింగ్ పీరియడ్‌ను వివరాలను కలిగి ఉన్నాము. అక్టోబర్ 2023 నెలకు వర్తించే ఈ వెయిటింగ్ పీరియడ్, పాన్-ఇండియా అంతటా వర్తిస్తుంది. ఈ కథనంలో, హ్యుందాయ్ వెన్యూ ఫేస్‌లిఫ్ట్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ ని మనం ఒకసారి పరిశీలిద్దాం.
హ్యుందాయ్ వెన్యూ ప్రస్తుతం 30 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంది. ఈ లాంగ్ వెయింటింగ్ పీరియడ్ SX డ్యూయల్-టోన్ 1.5 డీజిల్ ఎంటి వేరియంట్స్ పై మాత్రమే వర్తిస్తుంది. అదేవిధంగా, 1.2-లీటర్ పెట్రోల్ మిల్లులో S (O) SE, SX SE, SX మరియు SX డ్యూయల్-టోన్ వేరియంట్స్, అలాగే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఎంటి SX (O) SE, 1.0-లీటర్ టర్బో- పెట్రోల్ డిసిటి SX (O) SE, మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ డిసిటి SX (O) SE డ్యూయల్-టోన్ వేరియంట్స్ మాత్రం కేవలం రెండు వారాల వెయింటింగ్ పీరియడ్ ని మాత్రమే కలిగి ఉన్నాయి.
న్యూ హ్యుందాయ్ వెన్యూకు సంబంధించి అన్ని ఇతర వేరియంట్స్ ను ఎంచుకునే కస్టమర్స్ సగటున 2-16 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. సబ్-ఫోర్-మీటర్ ఎస్‍యువి అప్ డేటెడ్ వెర్షన్ ను ప్రారంభించడంతో, హ్యుందాయ్ ఐఎంటి ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసింది, ఇది గతంలో 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ వెర్షన్స్ తో ప్రత్యేకంగా అందించబడింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్