- E వేరియంట్ కంటే రూ. 29,000 ఎక్కువ ధరతో వచ్చిన కొత్త వేరియంట్
- ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో అందుబాటులో ఉన్నవెన్యూ E+ వేరియంట్
హ్యుందాయ్ మోటార్ ఇండియా వెన్యూ ఎస్‌యువిలో కొత్త E+ వేరియంట్‌ను లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్ బేస్-స్పెక్ E వేరియంట్ కంటే కొన్ని ఎక్కువ ఫీచర్లతో వచ్చింది. దీనిని రూ. 8.23 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో పొందవచ్చు. దీంతో, వెన్యూ కారు ఇప్పుడు E, E+, S, S ప్లస్, S (O), ఎగ్జిక్యూటివ్, S (O) ప్లస్, SX, నైట్ ఎడిషన్, SX (O) అనే 10 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
వెన్యూ కొత్త E+ వేరియంట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను పొందింది. అలాగే, E వేరియంట్ లో సన్ రూఫ్ ని పొందాలంటే 29వేల ఎక్కువ ధరతో లభిస్తుంది. అంతేకాకుండా, కొత్త వేరియంట్లో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు రియర్ హెడ్‌రెస్ట్, 60:40 స్ప్లిట్ రియర్ సీట్లు, వెనుక సీట్ల కోసం రెండు-స్టెప్ రిక్లైన్ ఫంక్షన్, 6 ఎయిర్‌బ్యాగ్స్, డే అండ్ నైట్ అడ్జస్టబుల్ ఐఆర్‍విఎం, ప్రయాణీకులు అందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్, ఇఎస్‍సి మరియు హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్ ఫీచర్లు ఉన్నాయి.
మెకానికల్‍గా, వెన్యూ E+ వేరియంట్ లోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేడ్ టె పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ మోటార్ 82bhp మరియు 114Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప