- ప్రత్యేకమైన స్టైలింగ్ ని కలిగి ఉన్న స్పెషల్ ఎడిషన్
- రెండు ఇంజిన్ ఆప్షన్లతో లభ్యం
హ్యుందాయ్ కంపెనీ ఈ మధ్యనే వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ ని లాంచ్ చేయగా, దీని ఎక్స్-షోరూం ధర రూ.10.15 లక్షలుగా నిర్ణయించబడింది. అయితే, స్పెషల్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ పరంగా అదనపు ఫీచర్లు మరియు అదనపు అంశాలను పొందింది. ఈ కారును మరింత స్పెషల్ గా మార్చడానికి, అందులో అందించబడిన టాప్-5 హైలైట్లను ఎక్స్‌క్లూజివ్ మీకు అందిస్తున్నాము. ఈ ఆర్టికల్ ద్వారా అవేంటో ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
1.ధృడమైన ఎక్స్‌టీరియర్
మొదటగా మనం ప్రస్తావించాల్సిన అంశం ఏమిటంటే, దీని పేరు. ఈ స్పెషల్ ఎడిషన్ పేరును హ్యుందాయ్ అడ్వెంచర్ ఎడిషన్ గా పిలుస్తుంది. దీని పేరుకు తగ్గట్లుగానే కార్ మేకర్ వెన్యూ కారును ధృడమైన డోర్ క్లాడింగ్ తో తీసుకువచ్చింది. అలాగే, ఈ కాంపాక్ట్ ఎస్‍యూవీ, కారుకు స్పోర్ట్స్ లుక్ ని అందించేలా కొత్త స్కిడ్ ప్లేట్లను కలిగి ఉంది.
బ్లాక్ కలర్లో అందించబడిన వివిధ అంశాలు
వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ కారు ఎన్నో రకాల బ్లాక్డ్ అవుట్ అంశాలతో డీ-క్రోమ్డ్ లుక్ ని కలిగి ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే, ఫ్రంట్ గ్రిల్, లోగో, ఒఆర్‍విఎంలు, మరియు షార్క్-ఫిన్ యాంటెన్నా వంటివి మనకు బ్లాక్ కలర్లో కనిపిస్తాయి. అలాగే, అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్లో ఉండగా, రెడ్ బ్రేక్ కాలిపర్స్ వీటికి మరింత అందాన్ని అందిస్తున్నాయి.
3. గ్రీన్ యాక్సెంట్లతో బ్లాక్ ఇంటీరియర్
స్పెషల్ ఎడిషన్ కారు లోపల చూస్తే, ఈ కారు సేజ్ గ్రీన్ కలర్డ్ ఇన్సర్ట్స్ తో ఆల్-బ్లాక్ థీమ్ ని పొందింది. ఇందులోని అప్హోల్స్టరీ కోసం సీట్లు కూడా కొత్త ప్యాటర్న్ తో అలంకరించబడగా, ఇవి గ్రీన్ హైలైట్లతో ఉన్నాయి.
4.స్పెషల్ ఎడిషన్ బ్యాడ్జింగ్
వెన్యూ అడ్వెంచర్ ఫ్రంట్ ఫెండర్ ని చూస్తే, దానిపై “అడ్వెంచర్” అనే ప్రత్యేకమైన బ్యాడ్జింగ్ ని కూడా ఈ కారు పొందింది.
5.డ్యాష్ క్యామ్
ఆసక్తి కలిగిన కొనుగోలుదారులు వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ లోపల డ్యూయల్ కెమెరాతో కూడిన ఫ్రీ డ్యాష్ క్యామ్ ని పొందవచ్చు.
పవర్ ట్రెయిన్
హ్యుందాయ్ కంపెనీ వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ ని రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందించగా, అందులో 82bhp పవర్ ని జనరేట్ చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 118bhp పవర్ ని జనరేట్ చేసే 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. అదేవిధంగా, మొదటి నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడి వచ్చింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్