- పెట్రోల్ మరియు టర్బో పెట్రోల్ వేరియంట్లలో లభ్యం
- బ్లాక్ ఇన్సర్ట్ లతో రేంజర్ ఖాకీ ఎక్స్‌టీరియర్ కలర్ తో అందించబడిన స్పెషల్ ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా వెన్యూలో మోడల్ లో ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చింది. రూ.10.15 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూం ధరతో వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ నేడే ఇండియాలో లాంచ్ అయ్యింది.
అప్ గ్రేడ్ లో భాగంగా, వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లతో పాటుగా డోర్ క్లాడింగ్ వంటి మెరుగైన, ఆకర్షణీయమైన అంశాలతో వచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ కారు రెడ్ కలర్ బ్రేక్ కాలిపర్స్ తో కూడిన గ్లోస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్ తో వచ్చింది. ఇది ఈ కారుకు మరింత అందాన్ని చేకూరుస్తుంది. అలాగే, ఇక్కడ చూస్తున్న రూఫ్ రెయిల్స్, ఓఆర్‌విఎంస్, మరియు షార్క్ ఫిన్ యాంటెన్నాను బ్లాక్ ఇన్సర్ట్ లతో రేంజర్ ఖాకీ ఎక్స్‌టీరియర్ కలర్ తో పొందవచ్చు.
ఇంటీరియర్ పరంగా, వెన్యూ అడ్వెంచర్ లోపల క్యాబిన్ సేజ్ గ్రీన్ యాక్సెంట్స్ తో బ్లాక్ థీమ్ ని కలిగి ఉంది. కొత్త స్పెషల్ ఎడిషన్లోని ఇతర ఫీచర్లలో డ్యాష్ కెమెరా, మ్యాట్స్, మరియు మెటల్ పెడల్స్ వంటివి ఉన్నాయి.
వెన్యూ అడ్వెంచర్ ఎడిషన్ కారును 1.2-లీటర్ పెట్రోల్ మరియు 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్లతో పొందవచ్చు. మొదటి ఇంజిన్ 82bhp పవర్ ని జనరేట్ ని చేస్తుండగా, ఇది మాన్యువల్ గేర్ బాక్సుతో అందుబాటులో ఉంది. అలాగే, రెండవ ఇంజిన్ 118bhp పవర్ ని జనరేట్ చేస్తుండగా, దీనిని డిసిటి యూనిట్ తో జతచేసి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్