- 2026లో ఇండియాకు వచ్చే అవకాశం
- కియా EV9 లాగే ఒకే రకమైన పవర్ ట్రెయిన్ మరియు ప్లాట్ ఫారం నుంచి వస్తున్న ఎలక్ట్రిక్ మోడల్
హ్యుందాయ్ కంపెనీ నుంచి ఇప్పటివరకు కోనా ఎలక్ట్రిక్ మరియు అయోనిక్ 5 అనే రెండ-వరుసల ఎలక్ట్రిక్ కార్లు అందించబడగా, ఇప్పుడు ఈ ఆటోమేకర్ మూడు-వరుసల ఎలక్ట్రిక్ ఎస్‍యూవీలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా, ఈ సంవత్సరం చివరలో మూడు-వరుసల ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ బ్యాండ్ వ్యాగన్ లోకి అడుగుపెట్టనుంది. ఈ సంవత్సరం అయోనిక్ కాన్సెప్ట్ సెవెన్ ప్రొడక్షన్ లోకి వెళ్తుందని అధికారికంగా నిర్ధారణ కాగా, ఇది మొదటగా యునైటెడ్ స్టేట్స్ లో అరంగేట్రం చేసిన తర్వాత ప్రపంచంలోని వివిధ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది.
సెవెన్ కాన్సెప్ట్ సిల్హౌట్ అచ్చం 2021లో ప్రదర్శించబడిన EV9 కాన్సెప్ట్ కారులాగే లోపల మరియు బయట ఒకే రకమైన డైమెన్షన్లతో ఉంది. ప్రొడక్షన్-రెడీ మోడల్ మరింత కన్వెన్షనల్ గా, అలాగే హ్యుందాయ్ ప్రస్తుతం టాప్ ఎస్‍యూవీలలో అందించిన వంపులు తిరిగిన ఎలిమెంట్స్ తో బాక్సీ షేప్ డిజైన్ అంశాలతో ఉంది.
కాన్సెప్ట్ సెవెన్ కూడా దాని పవర్‌ట్రెయిన్, ఫీచర్ లిస్ట్ మరియు ప్రాక్టికాలిటీని హ్యుందాయ్-కియా యూనివర్స్‌లోని EV9లో షేర్ చేసిన చాలా వరకు ప్రొడక్టులను ఇందులో షేర్ చేసుకుంటుందని భావిస్తున్నాం. EV9 మాదిరిగానే, ఇది కూడా 6-సీటర్ మరియు 7-సీటర్ కాన్ఫిగరేషన్లో అందించబడుతుంది. అయితే, EV9 కారుతో పోలిస్తే గ్లోబల్ గా సీనియర్ బ్రాండ్ అయిన హ్యుందాయ్ మరిన్ని 6-సీటర్ వేరియంట్లతో వచ్చే అవకాశం ఉంది.
ఇంకో అతి పెద్ద న్యూస్ ఏంటి అంటే, ఇది అధికారికం కాకపోయినా, సెవెన్ కాన్సెప్ట్ అయోనిక్ 9గా పిలువబడుతుండగా, హ్యుందాయ్ లైనప్ టాప్ లో దీని పొజిషన్ ఉండనుంది. ఈ కారును హ్యుందాయ్ కంపెనీ భవిష్యత్తులో అందించబడే కార్లలో భాగంగా తీసుకురానునట్లు మేము భావిస్తున్నాం. అదే విధంగా, ఈ కారు రూ. 90 లక్షల కారుగా అందించబడడం మరియు సిబియు మోడల్ లాగా మాత్రమే కాకుండా ప్రధానంగా దానికంటూ ప్రత్యేక గుర్తింపుతో రానుంది. హ్యుందాయ్ ఇండియా ఫ్యూచర్ లైనప్ లో భాగంగా సెవెన్ కాన్సెప్ట్ అనేది వస్తుందని భావిస్తుండగా, 2026 కల్లా ఇండియాకు రానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్