- ప్రస్తుతం ఇండియాలో మూడు సిఎన్‍జి కార్లను అందిస్తున్న హ్యుందాయ్
- త్వరలో దాని రేంజ్ లో డ్యూయల్ సిఎన్‍జి ట్యాంకులను ప్రవేశపెట్టే అవకాశం
హ్యుందాయ్ దాని సిఎన్‍జిలో అందించబడిన అప్‌డేట్ రేంజ్ కి సంబంధించి రెండు ట్రేడ్‌మార్క్‌లను నమోదు చేసింది. అలాగే, 'హెచ్ వై -సిఎన్‍జి' మరియు 'హెచ్ వై-సిఎన్‍జి డ్యూయో' అని పిలవబడుతున్న, ఈ ఇటరేషన్స్వాటి ప్రస్తుత మోడల్ రేంజ్ లో సింగిల్ మరియు ట్విన్-సిలిండర్ సిఎన్‍జి ట్యాంక్‌లతో అందించే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ప్రస్తుతం సిఎన్‍జి వెర్షన్‌లలో గ్రాండ్ i10 నియోస్, ఆరా మరియు ఎక్స్‌టర్ అనే మూడు కార్లను విక్రయిస్తోంది. ఈ కార్లు ప్రస్తుతం సింగిల్ సిఎన్‍జి ట్యాంక్‌తో విక్రయించబడుతున్నాయి, అయితే, హ్యుందాయ్ దీనిని (ట్విన్-సిలిండర్) డ్యూయల్ ట్యాంక్ సెటప్‌కు అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.
ముఖ్యంగా, టాటా మోటార్స్ కూడా దాని సెగ్మెంట్లలోని టియాగో, టిగోర్ మరియు పంచ్ కార్లలో హ్యుందాయ్ వలె డ్యూయల్-సిలిండర్ సిఎన్‍జి ట్యాంక్ సెటప్‌ను అందిస్తుంది. అదనంగా, దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, ఆల్ట్రోజ్ కూడా పైన చెప్పబడిన ఫీచర్‌తో అందుబాటులో ఉంది, అయితే దానికి పోటీగా ఉన్న హ్యుందాయ్ i20లో ప్రస్తుతం సిఎన్‍జి వెర్షన్ లేదు.
వివిధ మోడళ్లలో ట్విన్-సిలిండర్ టెక్నాలజీని ప్రారంభించడం ద్వారా లేదా టియాగో మరియు టిగోర్‌లలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ సౌలభ్యం తీసుకురావడం ద్వారా టాటా మోటార్స్ ఖచ్చితంగా సిఎన్‍జి కార్ల మార్కెట్‌లో ఇతర కార్ల సంస్థల కంటే ముందుగా మరో ముందడుగు వేసింది. అలాగే, హ్యుందాయ్ నుండి అప్ కమింగ్ (రాబోయే) కార్లు మునుపటి వాటికి ప్రతిస్పందనగా కనిపిస్తున్నాయి. అలాగే హ్యుందాయ్ గురించి చెప్పాలంటే , దాని సిఎన్‍జి రేంజ్ లో కూడా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ని అందించడానికి హ్యుందాయ్ కి ఎక్కువ సమయం పట్టదు.
అనువాదించిన వారు: రాజపుష్ప