- 3.01శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిన దేశీయ కార్లు
- 65,801యూనిట్లుగా ఉన్న మొత్తం అమ్మకాలు
హ్యుందాయ్ ఇండియా నవంబర్ 2023కి సంబంధించిన విక్రయాల సంఖ్యను ప్రకటించింది. గత నెలలో ఆటోమేకర్ మొత్తం 65,801 యూనిట్లను విక్రయించింది. ఇందులో దేశీయంగా 49,451 యూనిట్ల అమ్మకాలు ఉండగా మరియు 16,350 యూనిట్ల ఎగుమతులు ఉన్నాయి, తద్వారా 2.8 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది.
ఇతర వార్తలలో చూస్తే, హ్యుందాయ్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ వెహికల్, అయోనిక్ 5, దేశం అంతటా 1,100-యూనిట్ డెలివరీ అమ్మకాలు అధిగమించింది. 72.6kWh పవర్డ్ బ్యాటరీ ప్యాక్‌తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఒక్కసారి చార్జ్ చేస్తే సుమారు 631కి.మీ.వరకు ప్రయాణం చేయవచ్చు మరియు ఒకే ఒక్క, ఫుల్లీ లోడెడ్ వేరియంట్‌లో లభిస్తుంది.
నవంబర్ విక్రయాల సంఖ్యపై, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, సిఓఓ, తరుణ్ గార్గ్ వ్యాఖ్యానిస్తూ, “హ్యుందాయ్ మోటార్ ఇండియా నవంబర్ 2023లో 65,801 యూనిట్ల మొత్తం అమ్మకాలను నమోదు చేసింది. మొన్న పండుగ సీజన్‌లో కస్టమర్స్ నుంచి లభించిన స్పందనతో అధిక రిటైల్ విక్రయాలు నమోదవగా డానికి తగ్గట్టుగా, మా డీలర్ నెట్‌వర్క్ స్టాక్ మూడు వారాల అత్యంత అనుకూలమైన స్థాయిలో ఉంది. హ్యుందాయ్ కుటుంబంగా, మేము ఎంతో విజయవంతంగా ప్రస్తుత సంవత్సరం -23ని ఘనంగా ముగిస్తూ మరియు CY'24ని సాదరంగా స్వాగతించడానికి సిద్ధంగా ఉన్నాము” అని తెలిపారు.
అనువాదించిన వారు: రాజపుష్ప