- ఈఓపీ కంట్రోలర్ లో సమస్యే దీనికి ప్రధాన కారణం
- ఉచితంగా ఈ సర్వీసును అందిస్తున్న హ్యుందాయ్
హ్యుందాయ్ ఇండియా వెర్నా సెడాన్ సెలెక్ట్ ఐవిటి మోడల్స్ ని రీకాల్ చేస్తున్నట్లు నోటిఫికేషన్ ని జారీ చేసింది. కారులో సమస్యను ఎదుర్కొంటున్న బ్యాచ్ కార్ల ఓనర్లకు వారి కారును తనిఖీ చేయడానికి సమాచారం అందించి, ఆ సమస్యను సరిదిద్దనున్నట్లు కంపెనీ తెలిపింది. ఆటోమేకర్ ప్రకారం, ఈ కార్లన్నింటిని వెనక్కి రప్పించేందుకు కారణం ఏంటి అంటే, వీటి ఎలక్ట్రానిక్ ఆయిల్ పంప్ కంట్రోలర్ లో ఎదురైన సమస్యను ఫిక్స్ చేయడానికే అని తెలిసింది.
కస్టమర్లు ఎవరైతే ఈ నోటిఫికేషన్ ని అందుకున్నారో వారు వారికి సమీపంలో ఉన్న హ్యుందాయ్ అధికారిక డీలర్ షిప్స్ ని సందర్శించి తనిఖీ చేయించి, ఉచితంగా ఈ సర్వీసును పొందవచ్చని కంపెనీ తెలిపింది. తాజాగా, కియా ఇండియా కూడా ఓ బ్యాచ్ కి చెందిన సుమారు 4,300 సెల్టోస్ ఎస్‍యూవీ కార్లలో ఇదే సమస్య ఎదురైతే వాటిని రీకాల్ చేసింది.
ఇండియాలో మార్చి-2023లో హ్యుందాయ్ వెర్నా దేశవ్యాప్తంగా లాంచ్ చేసింది. ప్రస్తుతం ఇది EX, S, SX, మరియు SX (O) అనే నాలుగు వేరియంట్లలో రూ.11 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. టెక్నికల్ స్పెసిఫికేషన్స్ పరంగా చూస్తే, ఈ సెడాన్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో అనే రెండు 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్లతో వచ్చింది. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, ఐవిటి/సివిటి, మరియు 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సు ఆప్షన్లతో జత చేయబడ్డాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్