- హైడ్రోజన్ పవర్ సహాయంతో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయనున్న నెక్సో మోడల్
- సౌత్ కొరియాలో తయారైన వెహికిల్
హ్యుందాయ్ కంపెనీ ఇండియా అంతటా ఎదురుచూస్తున్న నెక్సో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ మోడల్ ని భారత్ మొబిలిటీ షో-2024 ద్వారా మరోసారి తెరపైకి తీసుకువచ్చింది. ఇండియాలో ఇది మూడోసారి ప్రదర్శితం కాగా, దీనికి పెద్దగా డిమాండ్ మరియు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడంతో కస్టమర్స్ నుంచి ఆదరణ కరువయింది.
హైడ్రోజన్ ఫ్యామిలీ నుంచి వస్తున్న నెక్సో హైడ్రోజన్ పవర్ సహాయంతో ఎలెక్ట్రిసిటీని ఉత్పత్తి చేసి, 95kWh బ్యాటరీ ప్యాక్ ని పంపిస్తుంది. అప్పుడు ఎలక్ట్రిక్ మోటారు 161bhp/395Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 9.2 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ స్పీడ్ ని ఈజీగా అందుకుంటుండగా, దీని టాప్ స్పీడ్ గంటకు 179 కిలోమీటర్లు ఉంది.
డిజైన్ పరంగా, హ్యుందాయ్ నుంచి వచ్చిన నెక్సోలో పెద్ద ఎల్ఈడీ లైట్ బార్స్, ఫ్లేర్డ్ వీల్స్ లో-సెట్ హెడ్ ల్యాంప్స్ మరియు బాడీ ఎడ్జెస్ వైపు ట్రయాంగులర్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇది 4.67 మీటర్ల పొడవు ఉండగా, దీని వీల్ బేస్ 2.7 మీటర్లుగా ఉంది.
ఇక్కడ ప్రదర్శించిన ఫుల్లీ లోడెడ్ నెక్సో మోడల్ కారులో 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఏడీఏఎస్(అడాస్), లెథెరెట్ అప్హోల్స్టరీ, డ్యూయల్ డిజిటల్ డిస్ ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంతకు ముందుగా చెప్పినట్లు, ఈ కారు ఇప్పట్లో ఇండియాకి వచ్చే అవకాశం లేదు కానీ, హ్యుందాయ్ కంపెనీ భవిష్యత్తులో ఇతర ఫ్యూయల్ వెహికిల్స్ తో వచ్చే అవకాశం ఉందని మాత్రం సూచిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్