- రెండింట్లో సన్ రూఫ్ ఆప్షన్ ని తీసుకువచ్చిన హ్యుందాయ్
- కొత్తగా హై-డ్యూయో సిఎన్‍జి టెక్నాలజీతో వచ్చిన ఎక్స్‌టర్ కారు
హ్యుందాయ్ కంపెనీ లేటెస్టు ఎక్స్‌టర్ మోడల్ లో ఎస్+ ఎఎంటిమరియుఎస్ (O)+ ఎంటి అనే రెండు కొత్త వేరియంట్లను లాంచ్ చేసింది. వీటిని వరుసగా రూ.7.86 లక్షలు మరియురూ. 8.43 లక్షలు ఎక్స్-షోరూం ధరలతో తీసుకువచ్చినట్లు హ్యుందాయ్ పేర్కొంది. మైక్రో ఎస్‍యూవీలో అందించబడిన రెండు ప్లస్ వేరియంట్లను మీరు సన్ రూఫ్ ఫీచర్ తో పొందాలనుకుంటే ఎస్ (O)+ ఎంటి వేరియంట్ పై రూ.28 వేలు, ఎస్+ ఎఎంటి వేరియంట్ పై రూ.31 వేలు అదనంగా చెల్లించి సన్ రూఫ్ ని పొందవచ్చు.
ఈ రెండు వేరియంట్లలో సన్ రూఫ్ మాత్రమే కాకుండా, డిజిటల్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో లేదా యాపిల్ కార్ ప్లేతో 8.0-ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, రియర్ ఏసీ వెంట్స్, అన్ని పవర్ విండోలు, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్, మరియు ఎస్కార్ట్ ఫంక్షన్ తో హెడ్ ల్యాంప్స్ వంటి హైలైట్ ఫీచర్లు ఉన్నాయి.
ప్రస్తుతం ఎక్స్‌టర్ కారును 82bhp/113.8Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్ 3-సిలిండర్ ఎంపిఐ పెట్రోల్ ఇంజిన్ తో అందించగా, దీనిని 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ ఎఎంటి గేర్ బాక్సుతో జతచేసి పొందవచ్చు. ఇంకో విషయం ఏంటి అంటే, హ్యుందాయ్ ఈ కారును సిఎన్‍జిలో కూడా అందించింది. దీంతో కస్టమర్లు దీని ఇంజిన్ ని సిఎన్‍జితో కలిపి పొందవచ్చు. ఇందులోని ఇంజిన్ సిఎన్‍జితో 68bhp/95Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే అందించబడింది. అలాగే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారులో హై-డ్యూయో సిఎన్‍జి అనే కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. ఈ టెక్నాలజీతో వచ్చిన మొదటి హ్యుందాయ్ కారు ఎక్స్‌టర్ అని చెప్పవచ్చు. అచ్చం ఇలాంటి ట్విన్-సిలిండర్ టెక్నాలజీ సెటప్ ని ఇప్పుడు టాటా దాని కార్లలో తీసుకువస్తుంది. సన్ రూఫ్ లను స్థానికంగా తయారుచేసే ఆపరేషన్ ని మొదలుపెట్టిన మొదటి కంపెనీ హ్యుందాయ్ అని చెప్పవచ్చు. దాని పూర్తి మోడల్స్ రేంజ్ లో ఈ బెనిఫిట్ ని అందిస్తున్న కంపెనీ కూడా హ్యుందాయ్ అని చెప్పవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్