- క్యాస్పర్ ఆధారపడి రానున్నమోడల్
- డబ్ల్యూఎల్‍టిపి -క్లెయిమ్ చేసిన 355కిమీ రేంజ్ ని అందించనున్న మోడల్
హ్యుందాయ్ అంతర్జాతీయంగా ఆల్-ఎలక్ట్రిక్ మైక్రో-ఎస్‌యువి, ఇన్‌స్టర్‌కి సంబంధించిన అధికారిక టీజర్ ని రిలీజ్ చేసింది. ఇది 2024 జూన్, 27వ తేదీన బుసాన్ ఇంటర్నేషనల్ మొబిలిటీ షోలో గ్లోబల్ అరంగేట్రం చేయనుంది. ఆటోమేకర్ ప్రకారం, దీనికిఇన్‌స్టర్ అనే పేరు 'ఇంటిమేట్' మరియు 'ఇన్నోవేటివ్' పదాల నుండి వచ్చింది.
2021 నుండి కొరియన్ మార్కెట్లో ఉన్న కాస్పర్ ఎస్‌యువి ఆధారంగా ఇన్‌స్టర్ రూపొందించబడుతుంది. మరో వైపు, ఆటోమేకర్దీనిని దాని సొంత దేశమైన సౌత్ కొరియాలో కాస్పర్ ఎలక్ట్రిక్'గా రీటైల్ చేస్తుంది. వచ్చే సంవత్సరంలో ఎక్స్‌టర్ ఆధారిత ఆల్-ఎలక్ట్రిక్ వెహికిల్ ఇన్‌స్టర్ రూపంలో ఇండియాలో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.
టీజర్ చేసిన ఫోటోల ప్రకారం, ఇన్‌స్టర్ మోడల్ క్యాస్పర్ సర్క్యులర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ హెడ్‌ల్యాంప్స్ మరియు పిక్సెల్-థీమ్డ్ టర్న్ ఇండికేటర్స్, టెయిల్‌లైట్‌లను కలిగి ఉంటుంది. అలాగే, ఇన్‌స్టర్ రాబోయే (అప్ కమింగ్) హ్యుందాయ్ క్రెటా ఈవీ మాదిరిగానే ఫ్రంట్ ఫెండర్-మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంటుంది.
ఇప్పుడు, ఆటోమేకర్ ఇన్‌స్టర్ బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే డబ్ల్యూఎల్‍టిపి-సర్టిఫైడ్ డ్రైవింగ్ రేంజ్ 355కిమీ క్లెయిమ్ చేయబడిన రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప