![అంతర్జాతీయంగా హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ఆవిష్కరణ, త్వరలోనే ఇండియాలో లాంచ్ ! అంతర్జాతీయంగా హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ ఆవిష్కరణ, త్వరలోనే ఇండియాలో లాంచ్ !](https://imgd.aeplcdn.com/642x361/n/cw/ec/180489/hyundai-left-front-three-quarter0.jpeg?isig=0&q=80)
- 355 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందించనున్న ఈవీ మోడల్
- రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడే అవకాశం
హ్యుందాయ్ కంపెనీ దాని కొత్త ఆల్-ఎలక్ట్రిక్ మోడల్ ఇన్‌స్టర్ ఈవీని ఆవిష్కరించి దాని ఎలక్ట్రిక్ గేమ్ ని షురూ చేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ నుంచి అందించబడనున్న అతి చిన్న మరియు అత్యంత చవకైన ఎస్‌యూవీగా ఈ మోడల్ నిలిచింది. అయితే, ఇది బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్ లాగా కాకుండా దాని ఐసీఈ ట్విన్ కాస్పర్ ఆధారంగా వచ్చింది.
![హ్యుందాయ్ ఫ్రంట్ వ్యూ Hyundai Front View](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
డిజైన్ పరంగా, ఇది కాస్పర్ లాగే యూత్ ఫుల్ లుక్ ని కలిగి ఉండి, మోడరన్-రెట్రో స్టైలింగ్ కొనసాగిస్తుంది. కారు ముందు భాగంలో, ఇది చుట్టూ హెడ్ ల్యాంప్ క్లస్టర్ తో సర్క్యులర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, బ్లాక్ పిల్ మాదిరిగా ఉండే డిజైన్ లో ఫ్రంట్ కెమెరా, హెడ్ ల్యాంప్స్, ఎడాస్ (ఏడీఏఎస్) సెన్సార్, అలాగే చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. వీటి పైన ఇన్‌స్టర్ మోడల్ విశాలంగా విస్తరించి ఉన్న బ్లాక్ బార్ పిక్సెల్-థీమ్డ్ టర్న్ ఇండికేటర్స్ ని కలిగి ఉంది.
![హ్యుందాయ్ రైట్ ఫ్రంట్ త్రీ క్వార్టర్ Hyundai Right Front Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
17-ఇంచ్ వరకు ఫోర్-స్పోక్ వీల్ ఆప్షన్లతో చంకీ వీల్ ఆర్చెస్ కారు సైడ్ ప్రొఫైల్ లో హైలైట్ గా నిలిచాయి. పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్, ఫంక్షనల్ రూఫ్-రెయిల్స్, మరియు పెద్ద విండోలతో ఇది ఎస్యూవీ లుక్ ని మరింత పెంచింది.
![హ్యుందాయ్ లెఫ్ట్ రియర్ త్రీ క్వార్టర్ Hyundai Left Rear Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
వెనుక భాగంలో, ఇన్‌స్టర్ కారు పిక్సెల్-థీమ్డ్ లైట్ బార్స్ ని పొందగా, ఇవి సెంటర్ నుంచి హ్యుందాయ్ లోగో వరకు విస్తరించి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, రియర్ ప్రొఫైల్ హై-మౌంటెడ్ స్టాప్ ల్యాంపుతో రూఫ్ స్పాయిలర్, బంపర్ ని అంటిపెట్టుకుని ఉన్నట్లుగా ఉన్న వీల్ ఆర్చెస్, దాని ప్రక్కన సర్క్యులర్ టెయిల్ ల్యాంప్స్ మరియు పార్కింగ్ లైట్స్ వంటి వాటితో స్పోర్ట్స్ లుక్ ని అందుకుంది.
డైమెన్షన్ల పరంగా, ఇన్‌స్టర్ 3,825ఎంఎం పొడవు, 1,610ఎంఎం వెడల్పుమ్ మరియు 1,575ఎంఎం ఎత్తును కలిగి ఉండి, 2,580ఎంఎం వీల్ బేస్ ని అందిస్తుంది. ఇందులో 280 లీటర్ల బూట్ స్పేస్ మనకు లభిస్తుండగా, రియర్ సీట్లను ఫోల్డ్ చేయడం ద్వారా 351 లీటర్ల వరకు బూట్ స్పేస్ లభిస్తుంది.
![హ్యుందాయ్ లెఫ్ట్ ఫ్రంట్ త్రీ క్వార్టర్ Hyundai Left Front Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
కలర్-ఆప్షన్ల పరంగా, ఇన్‌స్టర్ మోడల్ తొమ్మిది కలర్లలో అందించబడుతుండగా, అందులో అట్లాస్ వైట్, టామ్‌బాయ్ ఖాకీ, బిజారిమ్ ఖాకీ మ్యాట్, అన్బ్లీచ్డ్ ఐవరీ, సియన్నా ఆరెంజ్ మెటాలిక్, ఏరో సిల్వర్ మ్యాట్, డస్క్ బ్లూ మ్యాట్, ఎబిస్ బ్లాక్ పెర్ల్ మరియు బటర్‌క్రీమ్ ఎల్లో పెర్ల్ వంటి కలర్లు ఉన్నాయి.
![హ్యుందాయ్ డ్యాష్‌బోర్డ్ Hyundai Dashboard](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
ఇంటీరియర్ పరంగా, డ్యాష్ బోర్డు మరియు క్యాబిన్లో సాదారణంగా కనిపించే దానికి బదులుగా, మినిమల్ మరియు మాడరన్ పద్ధతిని ఉపయోగించింది. ఫీచర్ల విషయానికి వస్తే, ఇన్‌స్టర్ ఈవీ పెద్ద 10.25-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జర్ మరియు స్టీరింగ్ కాలమ్-మౌంటెడ్ డ్రైవ్ మోడ్ సెలెక్టర్ లివర్‌తో కూడిన మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇతర ఫీచర్లలో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, యాంబియంట్ లైటింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, సన్‌రూఫ్ మరియు ఎడాస్ (ఏడీఏఎస్)సూట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
![హ్యుందాయ్ లెఫ్ట్ రియర్ త్రీ క్వార్టర్ Hyundai Left Rear Three Quarter](https://imgd.aeplcdn.com/0x0/statics/grey.gif)
పవర్ ట్రెయిన్ మరియు స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే, హ్యుందాయ్ ఇన్‌స్టర్ కారు 42kWh మరియు 49kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ తో అందించబడుతుంది. రెండవ 49kWh బ్యాటరీ ప్యాక్ కేవలం లాంగ్ రేంజ్ వెర్షన్ కి మాత్రమే పరిమితం చేయబడింది. ఈ రెండు వెర్షన్లు సింగిల్ మోటారు సెటప్ తో రాగా, స్టాండర్డ్ వెర్షన్లో ఇది 95bhp ని, లాంగ్ రేంజ్ వెర్షన్లో 113bhp మరియు 147Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. రేంజ్ పరంగా చూస్తే, ఈ మోడల్ సింగిల్ ఛార్జ్ లో 355 కిలోమీటర్ల వరకు మాక్సిమం డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇంకో విషయం తెలుసా! ఇన్‌స్టర్ కారును 120kW డిసి ఫాస్ట్ ఛార్జర్ ని ఉపయోగించి కేవలం 30 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్