- ఎస్‍యూవీ స్టైలింగ్ తో సిటీ-ఫ్రెండ్లీ ఈవీగా వస్తున్న కొత్త మోడల్
- 2024 చివరలో ప్రొడక్షన్ ప్రారంభం
ఇన్‍స్టర్ క్రాస్ మోడల్ ని లాంచ్ చేస్తున్నట్లు హ్యుందాయ్ కంపెనీ ప్రకటించగా, ఇన్‍స్టర్ ఈవీ కొత్త వేరియంట్ బేసిక్ గా చూస్తే, ఒక అర్బన్-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వెహికిల్ గా వస్తుంది. ఈ కొత్త క్రాస్ ఓవర్ వేరియంట్ త్వరలోనే సెలెక్టెడ్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. ఇక్కడ అతి పెద్ద హైలైట్ ఏంటి అంటే, దీని స్టైలింగ్ ఎస్‍యూవీ లాగా కనిపిస్తూ ఉండగా, ఇన్‍స్టర్ కాంపాక్ట్ డైమెన్షన్లను కైగి ఉంటుంది.
ఇన్‍స్టర్ క్రాస్ మోడల్ విశాలంగా ఉంటూ, రెక్టాంగులర్ షేప్ లో ఫ్రంట్ మరియు రియర్ బంపర్లను, అలాగే ఆకర్షణీయమైన బ్లాక్ క్లాడింగ్ తో రానుంది. ఈ కారును ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లపై డ్రైవ్ చేస్తున్నప్పుడు రెగ్యులర్ ఇన్‍స్టర్ తో పోలిస్తే, ఇందులోని ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్ తో పాటుగా 17-ఇంచ్ అల్లాయ్ వీల్స్ కారును ప్రొటెక్ట్ చేస్తాయి. ఇన్‍స్టర్ క్రాస్ మోడల్ కొత్తగా గ్రీన్ కలర్లో అందించబడుతుండగా, ఇది క్రాస్ ఓవర్ వేరియంట్లో ఎక్స్‌క్లూజివ్ గా వస్తుంది.
కారు లోపల చూస్తే, ఇన్‍స్టర్ క్రాస్ మోడల్ కొత్త కలర్ మరియు కొత్త వేరియంట్ కాంబినేషన్ తో వస్తుంది. లైమ్-ఎల్లో యాక్సెంట్లతో గ్రే క్లాత్ ఇంటీరియర్ ని కలిగి ఉండనుంది. ఈ వేరియంట్ ద్వారా అందించబడిన ఎల్లో యాక్సెంట్లు డ్యాష్ బోర్డుపై మరింత అందంగా కనిపిస్తాయి. ఇంకా, బేస్ మోడల్ లో ఉన్న విధంగా, ఇన్‍స్టర్ క్రాస్ మోడల్ ఎన్నో స్టాండర్డ్ ఫీచర్లతో మరియు టాప్-స్పెక్ వేరియంట్లలో మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. అలాగే, ఈ కారు 359 కిలోమీటర్ల ఆల్-ఎలక్ట్రిక్ రేంజ్ ని అందిస్తుండగా, దీనిని కేవలం 30 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఈ కారును హ్యుందాయ్ కంపెనీ ఎడాస్ (ఏడీఏఎస్) ప్యాకేజీతో అందిస్తుండగా, అందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. ఈ సంవత్సరం చివరలో కొరియాలోని హ్యుందాయ్ మానుఫాక్చరింగ్ ప్లాంట్ లో ఇన్‍స్టర్ క్రాస్ మోడల్ ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్