- 2023 సంవత్సరంలో 6 లక్షల కార్ల విక్రయం
- జనవరి 16, 2024న లాంచ్ కానున్న క్రెటా ఫేస్‍లిఫ్ట్
హ్యుందాయ్ ఇండియా తన నెలవారీ రిపోర్టుకు సంబంధించి డిసెంబర్ నెల సేల్స్ రిపోర్టును ప్రకటించింది. 2023 సంవత్సరంలో 6 లక్షల కార్లను విక్రయించి అతి పెద్ద మైల్‍స్టోన్‍ని సాధించింది. నెలవారీగా చూస్తే, డిసెంబర్ నెలలో 10% వృద్ధితో 42,750 కార్లను విక్రయించింది.
ఈ కొరియన్ ఆటోమేకర్ మొత్తంగా 13 కార్ మోడల్స్ ద్వారా 2023 సంవత్సరంలో 7,65,786 యూనిట్లను విక్రయించింది. 2022లో విక్రయించిన 7,00,811 యూనిట్లతో పోలిస్తే 2023లో 9% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటి అంటే, ఇందులో డొమెస్టిక్ సేల్స్ మరియు ఎగుమతులు రెండు కలిపి ఉన్నాయి.
ఈ అచీవ్ మెంట్ పై హెచ్‌ఎంఐఎల్ సీఓఓ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “2023 మాకు కీలక సంవత్సరంగా మారడంతో, హ్యుందాయ్ మోటార్ ఇండియా తన అత్యధిక డొమెస్టిక్ సేల్స్ లో 6,02,111 యూనిట్లను విక్రయించి, గౌరవప్రదమైన 9% వృద్ధిని సాధించింది. 2022 సేల్స్ రిపోర్టుతో పోలిస్తేఅమ్మకాల పరంగా ఇది చాలా ఎక్కువ. అదే విధంగా హెచ్‌ఎంఐఎల్ తన స్పీడును పెంచడమే కాకుండా ఇండస్ట్రీ వృద్ధిని కూడా అవలీలగా సాధించి ఆటో ఇండస్ట్రీ రంగంలో రారాజుగా నిలిచింది. (సుమారుగా 8.2 శాతంగా అంచనా వేయబడింది), కస్టమర్లు హ్యుందాయ్ బ్రాండ్‌ను తమ ప్రాధాన్య మొబిలిటీ బ్రాండ్‌గా ఎంచుకున్నారనే దానికి ఈ సేల్స్ నిదర్శనం అని చెప్పవచ్చు. అలాగే 2023లో, మా కస్టమర్‌ల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చడానికి మేము మా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని ముందుగానే 50,000 యూనిట్లకు పైగా విస్తరించాము.” అని తెలిపారు.
ఇతర వార్తలలో చూస్తే, రూ.25,000 బుకింగ్ అమౌంట్ తో హ్యుందాయ్ రాబోయే క్రెటా ఫేస్‍లిఫ్ట్ యొక్క బుకింగ్స్ ప్రారంభించింది. జనవరి 16, 2024న క్రెటా ఫేస్‍లిఫ్ట్ మోడల్ ఇండియాలో లాంచ్ కానుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్