- ఇండియాలో i20 ప్రారంభ ధర రూ. 7.04 లక్షలు
- కార్వాలే వెబ్సైట్లో అందుబాటులో ఉన్న మల్టీప్లే హ్యుందాయ్ కార్లయొక్క వెయిటింగ్ పీరియడ్
జనవరి 2024 నెలలో హ్యుందాయ్ కార్లపై వెయిటింగ్ పీరియడ్‌ను పొందాము. ఈ కథనంలో, మారుతి బాలెనో మరియు టాటా ఆల్ట్రోజ్-వాటితో పోటీగా ఉన్న i20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పై వెయిటింగ్ పీరియడ్ వివరాలను పరిశీలిద్దాం.
జనవరి 2024 నాటికి, హ్యుందాయ్ i20 ఆస్టా(O) సివిటి మరియు స్పోర్ట్జ్ సివిటి వేరియంట్లపై 12 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఈ మోడల్ లోని అన్ని ఇతర వేరియంట్లు 5 వారాల వరకు మాత్రమే వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉన్నాయి. ఈ వెయిటింగ్ పీరియడ్ బుకింగ్ చేసుకున్నతేదీ నుండి మాత్రమే వర్తిస్తుందని మీరు గమనించాల్సి ఉంది.
గత వారం, i20 రేంజ్ ధర రూ.4,900 వరకు పెరగగా, దీంతో ఈ మోడల్ ధరలు రూ.7.04 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో ప్రారంభమయ్యాయి. అంతేకాకుండా, ఈమోడల్ రాబోయే నెలల్లో కొత్త స్పోర్ట్జ్ (O) వేరియంట్‌ను కూడా పొందనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప