- ఇండియాలో రూ.7.04 లక్షలతో i20 ధరలు ప్రారంభం
- పాన్-ఇండియా లెవెల్లో వెయిటింగ్ పీరియడ్ వర్తింపు
మార్చి-2024కి సంబంధించి హ్యుందాయ్ కార్ల అప్‍డేటెడ్ వెయిటింగ్ పీరియడ్ వివరాలు మేము కలిగి ఉన్నాము. క్రెటా మరియు వెన్యూ లాంటి ఇతర సెలెక్ట్ మోడల్స్ యొక్క టైంలైన్ వివరాలు మా వెబ్ సైట్లో పొందుపరిచాము. ఆ ఆర్టికల్ ద్వారా, i20 ప్రీమియం హ్యచ్ బ్యాక్ కి సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలను తెలుసుకుందాం.
మార్చి 2024లో హ్యుందాయ్ i20పై 10 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది, ఇది సివిటి వేరియంట్లపై మాత్రమే వర్తిస్తుంది. ఇది కాకుండా, కస్టమర్లు ఏదైనా ఇతర వేరియంట్ ని ఎంచుకున్నట్లయితే వారు 6 వారాల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టైంలైన్ పాన్-ఇండియా లెవెల్లో వర్తిస్తుంది. అదే విధంగా ప్రాంతం, వేరియంట్, కలర్, మరియు మరెన్నో అంశాలను బట్టి మారే అవకాశం ఉంది.
గత నెలలో, హ్యుందాయ్ కంపెనీ స్పోర్ట్జ్ (O) అనే వేరియంట్ ని రూ.8.73 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో i20 లైనప్ లో ప్రవేశపెట్టింది. మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజాతో పోటీ పడుతున్న ఈ మోడల్ 8 కలర్లలో 6 వేరియంట్లలో అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్