- రెగ్యులర్ మరియు N లైన్ వెర్షన్స్ లో అందుబాటులో ఉన్న i20
- సెలెక్టెడ్ వేరియంట్స్ పై పెరిగిన ధరలు వర్తింపు
జనవరి 2024 నుండి హ్యుందాయ్ తన మొత్తం మోడల్ రేంజ్ ధరలను పెంచింది. గత నెలలో ధరల పెంపును ప్రకటించిన వివిధ బ్రాండ్‌లలో ఈ కార్‌మేకర్ కూడా ఒకటిగా నిలిచింది. అలాగే i20 రేంజ్ పై పెరిగిన ధరలను ఇప్పుడు మనం పరిశీలిద్దాం.
హ్యుందాయ్ i20లోని ఆస్టా(O) ఎంటి వేరియంట్ పై రూ.1,900 పెరగగా, స్పోర్ట్జ్IVT, ఆస్టా ఎంటి డ్యూయల్-టోన్ మరియు స్పోర్ట్జ్ ఎంటి డ్యూయల్-టోన్‌లతో- సహా సెలెక్టెడ్ వేరియంట్‌ల ధరలలో ఎటువంటి మార్పులు లేవు. అన్ని ఇతర వేరియంట్‌లపై రూ. 4,900 వరకు ధరలు పెరిగాయి. ఇప్పుడు i20 యొక్క కొత్త ధరలు రూ. 7.04 లక్షల నుండి 11.21 లక్షల వరకు ఉన్నాయి.
అలాగే i20 N లైన్ విషయానికి వస్తే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ యొక్క స్పోర్టియర్ ఎంట్రీ-లెవల్ N6 ఎంటి వేరియంట్‌పై కేవలం రూ. 10 మాత్రమే పెరిగింది. అదే విధంగా, అన్ని ఇతర వేరియంట్లు ఏకరీతిగా ధర పెంపు రూ. 4,900 ఉంది. i20 N లైన్ ధర ఇప్పుడు రూ. 9.99 లక్షల నుండి రూ. 12.52 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప