- తాజాగా ఫేస్ లిఫ్ట్ వెర్షన్ లో రానున్న హ్యుందాయ్ i20
- ఇక నుంచి స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ తో రానున్న అన్ని హ్యుందాయ్ కార్లు
దేశవ్యాప్తంగా సెలెక్ట్ హ్యుందాయ్ డీలర్స్ ఇండియాలో ఉన్న రెగ్యులర్ i20 మరియు i20 ఎన్ లైన్ లతో కలిపి i20 రేంజ్ పై భారీగా డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఈ బెనిఫిట్స్ ని కస్టమర్లు క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్, మరియు కార్పోరేట్ డిస్కౌంట్స్ రూపంలో పొందవచ్చు.
హ్యుందాయ్ i20పై రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్ అందుబాటులో ఉంది. ఇతర వాటిలో చూస్తే, i20 ఎన్ లైన్ లోని సెలెక్ట్ వేరియంట్స్ పై రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ ని అందుబాటులో ఉంది.
ఈ నెల ప్రారంభంలో, హ్యుందాయ్ తమ లైనప్ లో ఉన్న కార్లలో సేఫ్టీ ఫీచర్స్ ని అప్ డేట్ చేసింది. దీంతో, హ్యుందాయ్ లోని అన్నీ కార్లు స్టాండర్డ్ గా 6-ఎయిర్ బ్యాగ్స్ తో రానున్నాయి. ఇండియాలో ఇలాంటి అద్బుతమైన సేఫ్టీ ఫీచర్స్ సూట్ ని అందిస్తున్న మొదటి బ్రాండ్ గా హ్యుందాయ్ నిలిచింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్