- ఇటీవలేi20 ఎన్లైన్ ఫేస్‌లిఫ్ట్‌నుపరిచయం చేసిన హ్యుందాయ్
- iMT యూనిట్నిరీప్లేస్ చేసిన 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్
ఈ నెల ప్రారంభంలో, హ్యుందాయ్ దేశంలో i20 మరియు i20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లను పరిచయం చేసింది. ఈ లాంచ్ ద్వారా అప్‌డేటెడ్ డిజైన్ మరియు కొత్త ఫీచర్స్ ను తీసుకురావడమే కాకుండా దీనిలోని టెక్నికల్ డిపార్టుమెంటులో కూడా మార్పును తీసుకువచ్చింది.
2023 i20 ఎన్ లైన్ లాంచ్ కావడంతో, హ్యుందాయ్ iMT ట్రాన్స్‌మిషన్‌ను నిలిపివేసింది. ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా భర్తీ చేయబడింది. ఈ మోడల్ 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 118bhp మరియు 172Nm టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
న్యూ హ్యుందాయ్ i20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ గురించి చెప్పాలంటే, ఇందులో న్యూ అల్లాయ్ వీల్స్, పూర్తి ఎల్ ఈడి హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేయబడిన రియర్ బంపర్, సెంటర్ కన్సోల్‌లో టైప్-సి-యూఎస్ బి పోర్ట్, బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ మరియు బోస్-సోర్స్డ్ 7- స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప