- ఇండియాలో రూ.9,99 లక్షలు నుండి ప్రారంభంకానున్న 2023 ఐ20 ఎన్ లైన్
- అందుబాటులోకి కొత్త 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్
హ్యుందాయ్ ఇండియా గత వారం దేశంలో ఫేస్‌లిఫ్టెడ్ ఐ20 ఎన్ లైన్‌ను లాంచ్ చేసింది, ప్రస్తుతం దీని ధరలు రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం ఉన్నాయి. ఈ మోడల్ 2 వేరియంట్స్ మరియు 7 కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం వాటి వివరాలను ఒకసారి పరిశీలిద్దాం.
2023 హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ 7 కలర్ ఆప్షన్స్ లో అందించబడుతుంది. వాటిని గమనిస్తే, మోనో టోన్ ఆప్షన్స్ అయిన అబిస్ బ్లాక్, స్టార్రి నైట్, థండర్ బ్లూ, టైటాన్ గ్రే మరియు అట్లాస్ వైట్ ఉన్నాయి. అయితే, డ్యూయల్-టోన్ పెయింట్స్ లో థండర్ బ్లూ మరియు అట్లాస్ వైట్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి అబిస్ బ్లాక్ రూఫ్‌తో ఉన్నాయి. వేరియంట్స్ పరంగా చూస్తే, కస్టమర్స్ N6 మరియు N8 మధ్య ఎంచుకోవచ్చు.
హుడ్ కింద మనం పరిశీలిస్తే, అప్‌డేటెడ్ ఐ20ఎన్ లైన్ 1.0-లీటర్, 3-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజన్ 118bhp మరియు 172Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది,అలాగే 7-స్పీడ్ డిసిటియూనిట్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కు పవర్ ని అందిస్తుంది. అవుట్‌గోయింగ్ వెర్షన్‌తో వచ్చిన ఐఎంటీ యూనిట్‌ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ భర్తీ చేసింది.
ఇంతకు ముందున్న వెర్షన్ కంటే కొత్త ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్‌లో పూర్తిగా ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ రియర్ బంపర్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్, బోస్-సోర్స్డ్ 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఓటీఏ అప్‌డేట్స్, టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ మరియు బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్