- ప్రారంభ ధర రూ.6.99 లక్షలు
- 5-వేరియంట్స్ లో అందుబాటులోకి రానున్న ఐ20 ఫేస్‌లిఫ్ట్
8 సెప్టెంబర్, 2023న దేశీయ మార్కెట్ లో హ్యుందాయ్ మోటార్ ఇండియా అప్‌డే టెడ్ చేసిన ఐ20ని లాంచ్ చేసింది. ఐదు వేరియంట్‌లలో అందుబాటులోకి రానున్న ఫేస్‌లిఫ్టెడ్ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధర రూ. 6.99 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఐ20 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో ఉన్న డీలర్‌షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
చిత్రంలో చూసినట్లుగా, i20 ఇప్పుడు అమెజాన్ గ్రే అనే కొత్త బాహ్య రంగు ఎంపికను పొందుతుంది. ఇది కాకుండా, హ్యాచ్‌బ్యాక్‌ను అట్లాస్ వైట్, టైటాన్ గ్రే, టైఫూన్ సిల్వర్, స్టార్రి నైట్, ఫైరీ రెడ్, అట్లాస్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, మరియు ఫైరీ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ అనే ఏడు రంగులలో పొందవచ్చు.
ఇక మార్పుల విషయానికొస్తే, న్యూ ఐ20 న్యూ గ్రిల్, బానెట్‌పై రీపోజిషన్ చేయబడిన హ్యుందాయ్ లోగో, బాణం-ఆకారపు డిఆర్ఎల్,ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు న్యూ సెట్ అల్లాయ్ వీల్స్ ముందు,వెనుక బంపర్‌ల రీడిజైన్ తో వస్తుంది.
లోపలి భాగంలో, హ్యుందాయ్ ఐ20 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు వంటి ఫీచర్లతో లోడ్ చేయబడింది. స్టాండర్డ్ సేఫ్టీ ప్యాకేజీలో ఐడిల్ స్టార్ట్/స్టాప్, ఈబిడితో కూడిన ఏబిఎస్, ఈఎస్ సి, హెచ్ఏసి, విఎస్ఎం, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, 3-పాయింట్ సీట్‌బెల్ట్ మరియు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఇందులో ఉండనున్నాయి.
మెకానికల్ గా, న్యూ హ్యుందాయ్ i20 82bhpమరియు 115Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారుతో అమర్చబడింది. ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ లో 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఐవిటి యూనిట్ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప