- ఇండియాలో మూడవ N లైన్ మోడల్ గా అందించబడుతున్న క్రెటాN లైన్
- టాప్ ఎండ్ N లైన్ వేరియంట్లను ఎంచుకున్న 82 శాతం కస్టమర్లు
హ్యుందాయ్ ఇండియా దేశవ్యాప్తంగా తాజాగా క్రెటా N లైన్ మోడల్ ని పరిచయం చేసి దాని N లైన్ పోర్ట్ ఫోలియోని మరింత విస్తరించింది. ఇది రెండు వేరియంట్లలో రూ.16.82 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. దీని ద్వారా, N లైన్ రేంజ్ లో ప్రస్తుతం i20 N లైన్, వెన్యూ N లైన్, క్రెటా N లైన్ అనే మూడు మోడల్స్ ఉన్నాయి. ఇక చివరిగా చెప్పిన క్రెటా N లైన్ మోడల్ కొరియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన N లైన్-స్పెసిఫిక్ మోడల్ గా నిలిచింది.
ఇప్పుడు, హ్యుందాయ్ కంపెనీ ఇండియాలో 22 వేలకు పైగా i20 N లైన్ మరియు వెన్యూ N లైన్ కార్లను విక్రయించినట్లు ప్రకటించింది. ఇంకా చెప్పాలంటే, 82 శాతం కస్టమర్లు టాప్ ఎండ్ N లైన్ వేరియంట్ కార్లను ఎంచుకున్నారు. ఇప్పుడు, క్రెటా యొక్క పెర్ఫార్మెన్స్ వెర్షన్ రాకతో హ్యుందాయ్ సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఇండియా దాని మొట్టమొదటి N లైన్ కారు అయిన i20 N లైన్ ని దేశవ్యాప్తంగా 2021 చివరలో లాంచ్ చేయగా, దాని తర్వాత వెన్యూ N లైన్ కారును సెప్టెంబర్ 2022లో లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ రెండు మోడల్స్ రెండు వేరియంట్లలో రూ.10 లక్షలు (ఎక్స్-షోరూం) మరియు రూ.12.08 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్