- ఇండియాలో రూ.5.92 లక్షలు (ఎక్స్-షోరూం)తో ప్రారంభమైన ధరలు
- అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్న బేస్ ఎరా వేరియంట్
ఇండియాలో హ్యుందాయ్ మోడల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి కారణం, పలు మోడల్స్ లో అందిస్తున్న సేఫ్టీ ఫీచర్స్ మరియు టెక్నాలజీ అని చెప్పవచ్చు. ఈ కొరియన్ ఆటోమేకర్ నుంచి వచ్చిన మోస్ట్ పాపులర్ మోడల్స్ లోగ్రాండ్ i10 నియోస్ ఒకటిగా నిలిచింది. దీంతో, ప్రస్తుతం దేశవ్యాప్తంగా దీనిపై వెయిటింగ్ పీరియడ్ కొనసాగుతుంది. ఇది వరకే మేము వెర్నా, ఎక్స్‌టర్, వెన్యూ, i20, మరియు క్రెటా ఫేస్‍లిఫ్ట్ యొక్క ప్రస్తుత వెయిటింగ్ పీరియడ్ ని అందించాము. ఈ ఆర్టికల్ లో గ్రాండ్ i10 నియోస్ యొక్క వెయిటింగ్ పీరియడ్ ని మీకు అందిస్తున్నాము.
వేరియంట్-వారీగా గ్రాండ్ i10 నియోస్ వెయిటింగ్ పీరియడ్ వివరాలు క్రింద ఇవ్వబడ్డాయి:
ఇంజిన్ | వేరియంట్ | వెయిటింగ్ పీరియడ్ |
1.2-లీటర్ పెట్రోల్ | ఎరా | 10-12 వారాలు |
మాగ్నా | 4-6 వారాలు | |
స్పోర్ట్జ్ | 4-6 వారాలు | |
స్పోర్ట్జ్ డ్యూయల్-టోన్ | 4-6 వారాలు | |
ఆస్టా | 4-6 వారాలు | |
మాగ్నా ఎఎంటి | 8-10 వారాలు | |
స్పోర్ట్జ్ ఎఎంటి | 4-6 వారాలు | |
ఆస్టా ఎఎంటి | 8-10 వారాలు | |
1.2-లీటర్ సిఎన్‍జి | మాగ్నా | 2-4 వారాలు |
స్పోర్ట్జ్ | 2-4 వారాలు |
హ్యుందాయ్ కంపెనీ గ్రాండ్ i10 నియోస్ ని ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, మరియు ఆస్టా అనే 4 వేరియంట్లలో అందిస్తుంది. మారుతి సుజుకి స్విఫ్ట్ తో పోటీ పడుతున్న దీని ధరలు రూ.5.92 నుండి రూ.8.56 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూం) మధ్య ఉన్నాయి. పవర్ ట్రెయిన్ ఆప్షన్ల పరంగా, దీనిని 1.2-లీటర్ గ్యాసోలిన్ ఇంజిన్ లేదా 1.2-లీటర్ పెట్రోల్-సిఎన్‍జి మోటారుతో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్