- మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్లలో లభ్యం
- ఆన్-ద-ఫ్లై ఫ్యూయల్-స్విచింగ్ ఆప్షన్ ని పొందిన హై-సిఎన్‍జి డ్యూయో మోడల్
హ్యుందాయ్ కంపెనీ ఇప్పుడు గ్రాండ్ i10 నియోస్ కారులో హై-సిఎన్‍జి డ్యూయో అనే కొత్త వెర్షన్ ని తీసుకువచ్చింది. ఇండియాలో గ్రాండ్ i10 నియోస్ హై-సిఎన్‍జి డ్యూయో మోడల్ రూ.7.75 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ అయింది. ఈ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే అందించబడగా, ఇప్పుడు ఇది మాగ్నా మరియు స్పోర్ట్జ్ అనే వేరియంట్లలో లభిస్తుంది.
ఇది వరకే ఎక్స్‌టర్ కాంపాక్ట్ ఎస్‍యూవీలో హై- సిఎన్‍జి డ్యూయో వెర్షన్ అందుబాటులోకి రాగా, సౌత్ కొరియన్ ఆటోమేకర్ దాని సిఎన్‍జి ట్యాంక్ డిజైన్ లో మార్పులు చేసింది. దీంతో, ఇందులో అందించబడిన పెద్ద ట్యాంక్ కాస్త రెండు భాగాలు కావడంతో, ఇవి బూట్ కింది భాగంలో అమర్చబడడం ద్వారా మరింత విశాలమైన బూట్ స్పేస్ లభిస్తుంది. ముఖ్యంగా గ్రాండ్ i10 నియోస్ వంటి కారులో బూట్ స్పేస్ చాలా ఇరుకుగా ఉంటుంది. అయితే, టాటా కంపెనీ సింగిల్ సిలిండర్ ఆప్షన్ ని వాటి మోడల్స్ లో తొలగించగా, మీరు గ్రాండ్ i10 నియోస్ కారును ఇప్పుడు కూడా ఒకే సిఎన్‍జి ట్యాంకుతో పొందవచ్చు.
ఇందులో హ్యుందాయ్ కంపెనీ 1.2-లీటర్ త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ని అందించగా, ఇది 68bhp మరియు 95.2Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కార్ మేకర్ ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ అనే ఒకే ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ని అందించగా, దీనిని మీరు డ్రైవ్ చేస్తూ కూడా పెట్రోల్ నుంచి సిఎన్‍జికి, సిఎన్‍జి నుంచి పెట్రోల్ కి మార్చుకోవచ్చు. ఈ ఫీచర్లను మీరు మాగ్నా మరియు స్పోర్ట్జ్ అనే స్టాండర్డ్ వేరియంట్లలో కూడా పొందుతారు. వీటికి అదనంగా, గ్రాండ్ i10 నియోస్ హై-సిఎన్‍జి డ్యూయో మోడల్ లోని అన్ని వెర్షన్లు 6 ఎయిర్ బ్యాగ్స్, టిపిఎంఎస్ హైలైన్, రియర్ పార్కింగ్ కెమెరా, డే అండ్ నైట్ ఐఆర్‌విఎం, మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్ సీ) వంటి ఫీచర్లను స్టాండర్డ్ గా పొందాయి.
కొత్త సిఎన్‍జి రేసులో మారుతి, టాటా కంపెనీలు ఉండగా, ఇప్పుడు నియోస్ మోడల్ ద్వారా హ్యుందాయ్ కూడా చేరింది. మారుతి కేవలం సింగిల్ సిలిండర్ సిఎన్‍జిని మాత్రమే అందించగా, ఇది భారీ ట్యాంకుతో అందించబడింది. అదేవిధంగా టాటా కంపెనీ సింగిల్ మరియు డ్యూయల్ సిలిండర్ ద్వారా టూ-పెడల్ ఆప్షన్ తో గేమ్ ని ప్రారంభించి, మొదటగా డ్యూయల్ సిఎన్‍జి సిలిండర్ సెటప్ ని తీసుకువచ్చిన మొదటి బ్రాండ్ గా నిలిచింది. ఇంకా పోటీ విషయానికి వస్తే, గ్రాండ్ i10 నియోస్ హై-సిఎన్‍జి డ్యూయో మోడల్ టియాగో సిఎన్‍జి ఎంటి/ఎఎంటి, టిగోర్ సిఎన్‍జి మోడల్స్ తో పోటీ పడుతుండగా, మరికొన్ని నెలల్లో రాబోయే స్విఫ్ట్ మరియు డిజైర్ సిఎన్‍జి కార్లతో పోటీపడుతుంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ హై-సిఎన్‍జి డ్యూయో ఎక్స్-షోరూం ధరలు:
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ హై-సిఎన్‍జి డ్యూయో మాగ్నా – రూ.7.75 లక్షలు (ఎక్స్-షోరూం)
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ హై-సిఎన్‍జి డ్యూయో స్పోర్ట్జ్ – రూ.8.30 లక్షలు (ఎక్స్-షోరూం)
అనువాదించిన వారు: సంజయ్ కుమార్