- కొత్తగాలాంచ్ అయిన నియోస్ స్పెషల్ వేరియంట్
- డబ్బుకు మంచి విలువను పొందే ఫీచర్స్ దీని సొంతం
హ్యుందాయ్ ఇటీవలే గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్‌ను ఇండియాలో ధరపై ఆధారపడి కార్లను కొనుగోలు చేసే కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుని లాంచ్ చేసింది. గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్, హ్యాచ్‌బ్యాక్మాగ్నా మరియు స్పోర్ట్జ్ వేరియంట్‌ల మధ్య ఉండగా, దీని మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ని రూ. 6.93 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, ఏఎంటి వెర్షన్ ను రూ.7.58 లక్షలు ధరతో పొందవచ్చు.ఈ మోడల్ గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు.
ఎక్స్‌టీరియర్
గ్రాండ్ i10 నియోస్ కార్పొరేట్ వేరియంట్, మాగ్నా వేరియంట్ కంటే కొన్ని ఎక్కువ ఎక్స్‌టీరియర్ అప్‌డేట్‌లను పొందింది. ఇందులో బ్లాక్ రేడియేటర్ గ్రిల్, బాడీ-కలర్ డోర్ హ్యాండిల్స్ మరియు ఒఆర్‍విఎంఎస్, ఎల్ఈడీ డిఆర్ఎల్స్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్, డ్యూయల్-టోన్ కవర్‌తో అమర్చిన 15-ఇంచ్ స్టీల్ వీల్స్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇది దాని టెయిల్‌గేట్‌పై కార్పొరేట్ లోగోనికలిగి ఉంది. వీటి ద్వారా నియోస్ వేరియంట్ వేరే మోడల్స్ వేరియంట్స్ కంటే కొంచెం వేరుగా కనిపిస్తుంది.
ఇంటీరియర్
క్యాబిన్ లో, కార్పొరేట్ వేరియంట్ 6.75-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు రియర్ ఏసీ వెంట్‌లతో కూడిన మాన్యువల్ ఎయిర్ కండీషనింగ్ తో కూడిన డ్యూయల్-టోన్ డాష్‌బోర్డ్‌ను పొందుతుంది.ఈ వేరియంట్‌లో స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, 4 స్పీకర్స్, ఎలక్ట్రిక్ ఒఆర్‍విఎంఎస్, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్, డ్రైవర్-సైడ్ ఆటో రోల్-డౌన్ పవర్ విండో, రియర్ పవర్ అవుట్‌లెట్ మరియు టైప్-సి ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.
సేఫ్టీ ఫీచర్స్
సేఫ్టీ ఫీచర్స్ పరంగా చూస్తే, కార్పొరేట్ ఎడిషన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, టిపిఎంఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ మరియు సీట్ బెల్ట్ రిమైండర్ ఉన్నాయి. ఆపై, అన్ని సీట్స్ లో మూడు-పాయింట్ సీట్ బెల్ట్స్ మరియు ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్‌లాక్ ఫంక్షన్ కూడా ఉన్నాయి.
ఇంజిన్ మరియు గేర్‌బాక్స్
గ్రాండ్ i10 నియోస్ కార్పోరేట్ వేరియంట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5-స్పీడ్ ఏఎంటీ (స్మార్ట్ ఆటో)తో జతచేయబడింది. ఈ ఇంజిన్ 82bhp మరియు 114Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ కార్పొరేట్ వెర్షన్ లో అందుబాటులో లేదు.
ధర మరియు పోటీ
కార్పొరేట్ 1.2లీటర్ కప్పా పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లేదా స్మార్ట్ ఆటో ఏఎంటీ వేరియంట్ ల రెండింటి తో పోటీగా ఉన్న, మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు టాటా టియాగోతోపోల్చిన తర్వాత వీటి ధరలు నిర్ణయించబడ్డాయి. అలాగే, ఈ మిడ్-స్పెక్ వేరియంట్‌లలోని ఫీచర్స్ పరంగా మొత్తానికి, కార్పొరేట్ వేరియంట్ డబ్బుకు మంచి విలువను అందిస్తుంది.ప్రత్యేకించి ఇప్పుడు స్విఫ్ట్ మిడ్-స్పెక్ వేరియంట్‌ల ధరలు పెరిగాయి. అలాగే, న్యూ-జెన్ స్విఫ్ట్ పైప్‌లైన్‌లో ఉండటంతో, కొత్త ఫీచర్స్ పొందిన తర్వాత దీని ధరలు కూడా నిర్ణయించబడతాయని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప