- 2024మార్చి31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్న ఆఫర్స్
- మాక్సిమం డిస్కౌంట్ కలిగి ఉన్న సిఎన్జి వేరియంట్స్
హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం పోర్ట్‌ఫోలియోపై 2024 మార్చి 31వ తేదీ వరకు భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దీని ఎంట్రీ-లెవల్ కార్ గ్రాండ్ i 10 నియోస్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న కస్టమర్లు, బుక్ చేసుకున్న తర్వాత రూ. 43,000 వరకు బెనిఫిట్లను పొందవచ్చు. మరిన్ని వివరాల గురించి ఈ ఆర్టికల్ ని పూర్తిగా చదవండి.
ప్రస్తుతం, గ్రాండ్ i10 నియోస్‌ను రూ.30,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ. 10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ. 3,000 కార్పొరేట్ డిస్కౌంట్ తో పొందవచ్చు. ముఖ్యంగా, పెట్రోల్ ఎంటి మరియు ఎఎంటి వేరియంట్లపై వరుసగా రూ. 15,000 మరియు రూ. 5,000, క్యాష్ డిస్కౌంట్ ను పొందవచ్చు. పైన పేర్కొన్న ఆఫర్లు 31 మార్చి, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రాంతం, డీలర్షిప్, వేరియంట్, కలర్ మరియు ఇతర కారకాలపై ఆధారపడి ఈ ఆఫర్లు మారవచ్చు.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్‌ను ఎరా, మాగ్నా, స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్, స్పోర్ట్జ్ మరియు ఆస్టా అనే ఐదు వేరియంట్లలో అందిస్తోంది, దీని ధరలు రూ. 5.92 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యాయి. పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే, హ్యాచ్‌బ్యాక్ ను పెట్రోల్ మరియు సిఎన్జి ఆప్షన్స్ తో పొందవచ్చు. ఇందులో 1.2-లీటర్ కప్పా గ్యాసోలిన్ ఇంజిన్ పెట్రోల్ మోడ్‌లో 82bhp మరియు 114Nm టార్క్ మరియు సిఎన్జి మోడ్‌లో 68bhp మరియు 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ట్రాన్స్మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప