హ్యుందాయ్ ఎక్స్‌టర్ గత ఏడాది జూలైలో లాంచ్ అయినప్పటినుండి అమ్మకాలతో ఇండియన్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ తో కొనసాగుతుంది. అలాగే, టాటా మోటార్స్ దాని ఎంట్రీ-లెవెల్ ఎస్‍యూవీ పంచ్ ని 2021లో ఇండియాలో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి, హ్యుందాయ్ ఎక్స్‌టర్ తో పోటీపడుతున్న ఈ మోడల్ కి కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున అద్బుత స్పందన రావడంతో బాగా పాపులర్ అయింది. ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఈ రెండు కార్లకు భలే గిరాకీ ఉంది. ఈ రెండు కార్లు మెరుగైన ఫీచర్లతో రాగా, ఒకదానితో ఒకటి పోటీగా ఉన్న వీటి ధరను పోలిస్తే ప్రారంభ ధరలు ఒకేలా ఉన్నపటికీ, ఇందులో ఏ కార్ మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఈ ఆర్టికల్ చదివి ఆ కార్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.
ధరలు మరియు వేరియంట్స్
ఈ ఎక్స్‌టర్ కాంపాక్ట్ ఎస్‌యువి అట్లాస్ వైట్,ఫియరీ రెడ్,రేంజర్ ఖాకీ,స్టార్రి నైట్, టైటాన్ గ్రే,రేంజర్ ఖాకీ విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్,అట్లాస్ వైట్ విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్,కాస్మిక్ బ్లూ విత్ ఎబిస్ బ్లాక్ రూఫ్ అనే 9 కలర్స్ లో, EX, S, SX మరియు SX (O) అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీనిని రూ.6.13 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు.
టాటా మోటార్స్ పంచ్ మోడల్ ని రూ. 6.13 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇదిటొర్నాడో బ్లూ విత్ వైట్ రూఫ్, కాలిప్సో రెడ్ విత్ వైట్ రూఫ్, మెటరో బ్రాంజ్ విత్ బ్లాక్ రూఫ్, బ్లాక్ రూఫ్ విత్ అటామిక్ ఆరెంజ్, బ్లాక్ రూఫ్ విత్ ట్రాపికల్ మిస్త్, డేటోనా గ్రే విత్ బ్లాక్ రూఫ్, వొర్క్స్ వైట్ విత్ బ్లాక్ రూఫ్, గ్రాస్‍ల్యాండ్ బీజ్ విత్ పియానో బ్లాక్ రూఫ్, ఫోలియాజ్ గ్రీన్ విత్ వైట్ రూఫ్అనే 9 కలర్స్ తో, ప్యూర్, అడ్వెంచర్, అకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్ అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఫీచర్స్
హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఫీచర్స్ | టాటా పంచ్ ఫీచర్స్ |
స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ | 7.0-ఇంచ్ హర్మాన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ |
న్యూ గ్రిల్ | ఎల్ఈడీ, డీఆర్ఎల్ఎస్ |
న్యూ ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ | 16-ఇంచ్ డైమండ్ కట్ వీల్స్ |
న్యూ అల్లాయ్ వీల్స్ | ఆటో హెడ్‌ల్యాంప్స్ |
బ్లాక్ రూఫ్ రెయిల్స్ | రెయిన్ సెన్సింగ్ వైపర్స్ |
ఏ - పిల్లర్-మౌంటెడ్ ఒఆర్విఎంఎస్ | ఆటో హెడ్‌ల్యాంప్స్ |
బ్లాక్-అవుట్ బీ-పిల్లర్స్ | కూల్డ్ గ్లోవ్‌బాక్స్ |
సీ-పిల్లర్-మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ | క్లైమేట్ కంట్రోల్ |
షార్క్-ఫిన్ యాంటెన్నా | పడిల్ల్యాంప్స్ |
ఎల్ఈడీ టెయిల్ లైట్స్ | క్రూయిజ్ కంట్రోల్ |
డ్యాష్‌బోర్డ్ కెమెరా | ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్స్ |
రియర్ ఏసీ వెంట్స్ | పవర్ మిర్రర్స్ |
వైర్‌లెస్ ఛార్జర్ | ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ |
రూఫ్ రెయిల్స్ | |
బటన్ స్టార్ట్ | |
రివర్స్ కెమెరా |
పవర్‌ట్రెయిన్
టాటా పంచ్ ప్రత్యేకంగా 1.2-లీటర్, 3-సిలిండర్, రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో రాగా, ఇది 84bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బిఎస్-6 ఫేజ్ 2-కంప్లైంట్ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా ఒక ఏఎంటి యూనిట్ ద్వారా ముందు వీల్స్ కు పవర్ ని పంపుతుంది.
మెకానికల్‍గా, హ్యుందాయ్ ఎక్స్‌టర్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఈ మోటార్ 82bhp మరియు 114Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.