- 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్తో ఆధారితం
- 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో అందుబాటులో ఉన్న మోడల్
హ్యుందాయ్ ఎక్స్టర్ కారు కొంతకాలంగా ఇండియన్ మార్కెట్ లో అందుబాటులో ఉండగా, ఇప్పుడు ఈ కారు మరింత విక్రయాలను అధిగమించి సరికొత్త మైలురాయిని సాధించిందని హ్యుందాయ్ ఇండియా పేర్కొంది. ముఖ్యంగా చెప్పాలంటే, దీని ఫీచర్లు మరియు బాడీ స్టైల్ ని బట్టి, ఇది గ్రాండ్ i10 నియోస్ వలె ఉంటుంది. అదేవిధంగా, ఇది పాడిల్ షిఫ్టర్స్ మరియు సన్రూఫ్ వంటి మరింత గణనీయమైన మరియు హై-ఎండ్ ఫీచర్లు కనిపించేలా హ్యుందాయ్ దీనికి క్రాస్ఓవర్ లాంటి డిజైన్ అంశాలను అందించింది. ఇక్కడ, మేము ఈ కారు రియల్ వరల్డ్ మైలేజ్ కోసం 5-స్పీడ్ఏఎంటీతో జతచేయబడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో టెస్టింగ్ నిర్వహించాము. వాటి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం.
రియల్ వరల్డ్ మైలేజ్
1.2-లీటర్ ఇంజిన్ 82bhp మరియు 114Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. మరియు అధికారికంగా, ఎక్స్టర్ కారు 19.2కెఎంపిఎల్ మైలేజీని అందిస్తున్నట్లు హ్యుందాయ్ కంపెనీ క్లెయిమ్ చేసింది . మేము నిర్వహించిన రియల్ వరల్డ్ మైలేజ్ టెస్టులలో, ఈ కారుని సిటీ రోడ్లపై డ్రైవ్ చేయగా, ఇది ఎంఐడి డిస్ ప్లేలో 11.1కెఎంపిఎల్ చూపించగా, 10.7 కెఎంపిఎల్ మైలేజీని అందించింది. హైవే రోడ్లపై, ఎంఐడి 20.1కెఎంపిఎల్ ని సూచించగా, 18.5కెఎంపిఎల్ మైలేజీని ఇచ్చింది. ఈ మొత్తం నెంబర్లను యావరేజ్ గా చూస్తే, ఎక్స్ టర్ కారు 12.64కెఎంపిఎల్ మైలేజీని అందించింది మరియు ఈ కారులోని 37 లీటర్ల ట్యాంక్ కెపాసిటీని పరిగణనలోకి తీసుకుంటే, ఇది రియల్ వరల్డ్ మైలేజ్ టెస్టులలో468కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందించింది.
న్యూ ఎక్స్టర్ వేరియంట్స్
హ్యుందాయ్ ఇటీవలే ఎక్స్టర్ లో కొత్త వేరియంట్లను పరిచయం చేసింది. ఈ మోడల్ లో S+ ఏఎంటీ మరియు S (O )+ ఎంటి అనే వేరియంట్ ఉన్నాయి. వీటి ధరల విషయానికొస్తే, S+ ఏఎంటీ వేరియంట్ రూ. 7.86 లక్షల (ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉండగా, S (O )+ ఎంటి వేరియంట్రూ. 8.43 లక్షల (ఎక్స్-షోరూమ్)ధరతో అందుబాటులో ఉంది.సన్ రూఫ్ లేని వాటితో పోలిస్తే, ఈ రెండింట్లో ‘+’ మోడల్స్ సన్రూఫ్ ఫీచర్ను కలిగి ఉన్నాయి. వాటిని రూ. 28,000 (ఎంటి) మరియు రూ.31,000 (ఏఎంటీ) అదనపు ధరతో వీటిలో పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప