- ఎక్స్-షోరూం ప్రారంభ ధర రూ. 8.38 లక్షలు
- మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లలో లభిస్తున్న ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్
హ్యుందాయ్ ఇండియా ఎక్స్‌టర్ మోడల్ ని లాంచ్ చేసి సంవత్సరం అవుతుండగా, దాని మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేయడానికి ఎక్స్‌టర్ లో నైట్ ఎడిషన్ ని తీసుకువచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ ని మైక్రో ఎస్‍యూవీలోని SX మరియుSX (O) కనెక్ట్వేరియంట్లకు హ్యుందాయ్ పరిచయం చేసింది. ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఎక్స్‌టర్ లోని స్టాండర్డ్ వేరియంట్లతో పోలిస్తే విభిన్నంగా ఉండే నైట్ ఎడిషన్ లో టాప్ హైలైట్ ఫీచర్లు ఏమేం ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం.
బ్లాక్డ్-అవుట్ ఎక్స్‌టీరియర్
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ఇప్పుడు ఐదు మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో అందించబడింది. అయితే, ప్రధానంగా బ్లాక్ సైడ్ సిల్ గార్నిష్, డార్క్ కలర్ లో చిహ్నాలు(సింబల్స్), బ్లాక్ ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్ వంటి బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్స్, మరియు 15-అల్లాయ్ వీల్స్ బ్లాక్ కలర్ లో పెయింట్ తో అందించబడ్డాయి.
రెడ్ కలర్ యాక్సెంట్స్
ఏకైక బ్లాక్ కలర్ కి బ్రేక్ ఇస్తూ, సబ్-కాంపాక్ట్ ఎస్‍యూవీ ఫ్రంట్ బంపర్ మరియు రియర్ టెయిల్ గేట్ పై స్పోర్టీ లుక్ ని అందించడానికి రెడ్ యాక్సెంట్స్ తో వచ్చింది. ఇంకా చెప్పాలంటే, బ్రేక్ కాలిపర్స్ కూడా రెడ్ కలర్ లో పెయింట్ చేయబడ్డాయి.
బ్లాక్ మరియు రెడ్ ఇంటీరియర్
ఇంటీరియర్ విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ రెడ్ యాక్సెంట్స్ మరియు స్టిచింగ్ తో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ ని పొందింది. అలాగే ఇది రెడ్ ఫుట్ వెల్ లైటింగ్, రెడ్ స్టిచింగ్ తో ఫ్లోర్ మ్యాట్స్ మరియు ప్రత్యేకంగా కనిపించే అప్ హోల్స్టరీ, బ్లాక్ సాటిన్ డోర్ హ్యండిల్స్ మరియు స్టీరింగ్ వీల్ మరియు మెటల్ స్కఫ్ ప్లేట్స్ వంటి వాటిని పొందింది.
పవర్ ట్రెయిన్
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ 1.2-లీటర్ ఫోర్-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 83bhp మరియు 114Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ కారులోని ఇంజిన్ ని 5-స్పీడ్ మాన్యువల్ తో లేదా ఎఎంటితో జతచేయబడి పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్