- నైట్ ఎడిషన్‌ను పొందనున్న మూడవ మోడల్
- మెకానికల్‍గా ఎటువంటి మార్పులు లేకుండా రానున్న మోడల్
హ్యుందాయ్ ఇండియా దాని సరికొత్త ఎస్‌యువి ఎక్స్‌టర్ స్పెషల్ ఎడిషన్‌ను మొట్టమొదటి సారిగా ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ మోడల్ త్వరలో పూర్తిగా బ్లాక్-అవుట్ వెర్షన్‌ను అందుకొని, హ్యుందాయ్ 'నైట్ ఎడిషన్' అనే పేరుతో రానుంది. ఇప్పుడు, ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ క్రెటా మరియు వెన్యూ తర్వాత, హ్యుందాయ్ మరో మోడల్ ఎక్స్‌టర్ రేంజ్ లోకి కూడా నైట్ ఎడిషన్‌ను జోడించనుంది.
టెయిల్‌గేట్‌పై రెడ్ గార్నిష్ బ్లాక్ పెయింట్ స్కీమ్, బ్లాక్-అవుట్ పిల్లర్స్ మరియు రూఫ్ స్పాయిలర్ వంటి వివరాలు టీజర్ ద్వారా వెల్లడయ్యాయి. అలాగే, గ్రిల్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రెయిల్స్, పిల్లర్స్ మరియు టెయిల్‌గేట్‌పై ఉన్న లెటర్రింగ్ మరియు లోగోలకు బ్లాక్ ట్రీట్‌మెంట్ అందించబడుతుందని మేము ఆశిస్తున్నాము. అంతేకాకుండా, ఎక్స్‌టర్ క్యాబిన్ హెడ్‌రెస్ట్‌లపై బ్యాడ్జ్‌లతో బ్లాక్-అవుట్ థీమ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఫీచర్ల వారీగా చెప్పాలంటే, ఎస్‌యువి ఎటువంటి కొత్త ఫీచర్స్ ను పొందే అవకాశం లేదు అని చెప్పవచ్చు, అయితే ఈ ప్యాకేజీలో భాగంగా థీమ్డ్ ఫ్లోర్ మ్యాట్స్ మరియు సిల్ గార్డ్‌స్ వంటి వాటిని మనం ఆశించవచ్చు.
మెకానికల్‍గా, హ్యుందాయ్ ఎక్స్‌టర్ అదే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మోటారు 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌లతో జతచేయబడి కొనసాగుతుంది. అలాగే, ఈ మోటార్ 81bhp మరియు 113Nm టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. ఇప్పుడు, ఎక్స్‌టర్ ను సిఎన్‌జి- ఫీచర్లతో పాటుగా అమర్చిన వేరియంట్‌తో కూడా పొందవచ్చు. అయితే, హ్యుందాయ్ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ని సిఎన్‌జి పవర్‌ట్రెయిన్‌తో పరిచయం చేస్తుందా ? లేదా ? అనేది ఇంకా నిర్ధారణ కాలేదు.
అనువాదించిన వారు: రాజపుష్ప