- రూ.8.38 లక్షలతో ప్రారంభమైన ఎక్స్టర్ నైట్ ఎడిషన్ ధరలు
- సిఎన్జి డ్యూయో ఆప్షన్ లో కూడా దీనిని పొందే అవకాశం
హ్యుందాయ్ ఇండియా ఇటీవలే ఇండియాలో ఎక్స్టర్ ఎస్యూవీ నైట్ ఎడిషన్‌ను SX వేరియంట్‌తో రూ. 8.38 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. లాంచ్ తర్వాత, ఇప్పుడు ఈ మోడల్ ఇండియాలోని అన్ని డీలర్‌షిప్‌ల వద్ద చేరుకోవడం ప్రారంభమైంది.
ఎక్స్టర్ నైట్ ఎడిషన్‌ను స్టార్రీ నైట్, అట్లాస్ట్ వైట్, రేంజర్ ఖాకీ, షాడో గ్రే, అబిస్ బ్లాక్, రేంజర్ ఖాకీ విత్ అబిస్ బ్లాక్ రూఫ్ మరియు షాడో గ్రే విత్ అబిస్ బ్లాక్ రూఫ్ అనే 5 ఎక్స్టీరియర్ పెయింట్ స్కీమ్‌లలో పొందవచ్చు. ఈ అన్ని పెయింట్ స్కీమ్‌లు బంపర్స్, టెయిల్‌గేట్ మరియు ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్ పై ఉన్న కాంట్రాస్టింగ్ రెడ్ యాక్సెంట్లతో సరిపోయేలా ఉన్నాయి. అంతే కాకుండా, సైడ్ సిల్స్, ఎంబ్లమ్స్, ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్ మరియు అల్లాయ్ వీల్స్ డార్క్ కలర్ ను పొందుతాయి.
లోపలి భాగంలో, డార్క్ థీమ్ వివిధ చోట్ల రెడ్ కలర్స్ తో జతచేయబడి మొత్తం అన్ని చోట్ల కూడా బ్లాక్ కలర్ తో అందించబడింది. ఫీచర్లకు సంబంధించి, నైట్ ఎడిషన్ SX మరియు SX (O) వేరియంట్ల ఆధారంగా వచ్చింది కాబట్టి, స్టాండర్డ్ వెర్షన్లలో అందించబడిన అదే ఫీచర్లను ఇందులో కూడా కొనసాగిస్తుంది.
మెకానికల్‌గా, ఎక్స్టర్ మోడల్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేయబడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ని పొందింది. ఎక్స్టర్ కారు. ఫ్యాక్టరీ అమర్చిన సిఎన్జి కిట్ కూడా అందించబడింది. దీనిని మీరు సింగిల్ ట్యాంక్ మరియు డ్యూయల్ ట్యాంక్ తో రెండు విధాలుగా ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప