హ్యుందాయ్ ఈ నెల ప్రారంభంలో ఇండియాలో ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్‌ను రూ. 8.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 4 వేరియంట్స్ మరియు 3 కలర్స్ లో లాంచ్ చేసింది. టాటా పంచ్ మరియు సిట్రోన్ C3 వంటి వాటికి పోటీగా ఉన్న ఈ బి-ఎస్‌యువి ఎడిషన్ ఇండియన్ మార్కెట్లో ఎక్స్‌టర్ ద్వారా మొత్తం 93,000 యూనిట్ల విక్రయాలను ఘనంగా నిర్వహించింది. ఇప్పుడు ఈ ఫోటోల సెట్ ద్వారా కారు వివరాలను మనం పరిశీలిద్దాం.
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్, అబిస్ బ్లాక్, షాడో గ్రే మరియు షాడో గ్రే విత్ అబిస్ బ్లాక్ రూఫ్అనే మూడు ప్రత్యేకమైన కలర్లను కలిగి ఉంది. అలాగే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ఫాసియాలో మార్పులు బ్లాక్-అవుట్ స్కిడ్ ప్లేట్ మరియు దాని పైన ఉన్న రెడ్ ఇన్సర్ట్‌కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి. కారుకు రెండు వైపులా, స్పెషల్ ఎడిషన్ అల్లాయ్ వీల్స్ మరియు సైడ్ సిల్స్ బ్లాక్ ఫినిషింగ్‌ను పొందగా, ఫ్రంట్ బ్రేక్ కాలిపర్స్ రెడ్ పెయింట్ ఫినిషింగ్‌ను కూడా పొందాయి.
కారు వెనుక భాగంలో, సరికొత్త బ్లాక్ స్కిడ్ ప్లేట్, టెయిల్‌గేట్‌పై రెడ్ కలర్ మరియు 'నైట్' లోగోని కలిగి ఉంటుంది. లోపలి భాగంలో, ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ రెడ్ యాక్సెంట్స్ మరియు స్టిచింగ్‌లతో ఆల్-బ్లాక్ థీమ్‌ను కలిగి ఉంది.ఈ కారు రెడ్ కలర్ ఫుట్‌వెల్ లైటింగ్‌ను కూడా పొందింది. అదనంగా, డోర్ హ్యాండిల్స్ మరియు స్టీరింగ్ వీల్ శాటిన్ బ్లాక్ ఫినిషింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇందులో మెటల్ స్కఫ్ ప్లేట్స్ కూడా అందించబడగా, సీట్స్ రెడ్-స్టిచింగ్ మరియు పైపింగ్‌తో నైట్-స్పెసిఫిక్ అప్హోల్స్టరీ అమర్చబడి ఉంటాయి.
హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్లోని 1.2-లీటర్, 4-సిలిండర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో జత చేయబడి ఉంది. అలాగే, కస్టమర్‌లు ఈ మోడల్ ని SX, SX డ్యూయల్-టోన్, SX (O) కనెక్ట్ మరియు SX (O) కనెక్ట్ డ్యూయల్-టోన్ అనే 4 వేరియంట్స్ నుండి ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప