- SX మరియు SX (O) ఆధారంగా వచ్చిన నైట్ ఎడిషన్
- ఇప్పటి వరకు 93,000 పైగా విక్రయించబడ్డ ఎక్స్‌టర్ యూనిట్లు
హ్యుందాయ్ ఇండియా ఎక్స్‌టర్ ఎస్‍యూవీ మొదటి వార్షికోత్సవాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేయడానికి, ఈ మోడల్ లో ఇప్పుడు కొత్త స్పెషల్ నైట్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ రూ. 8.38 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులోకి రాగా, ఇది SX మరియు SX (O) ఆధారంగా వచ్చింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పటి వరకు 93,000 పైగా ఎక్స్‌టర్ యూనిట్లు విక్రయించబడ్డాయి. దీన్ని బట్టి మనం ఈ కారుకు ఎంత డిమాండ్ ఉండనే అంశాన్ని ఈజీగా చెప్పేయవచ్చు.
ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ ఇప్పుడు ఐదు మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది, అవి ఏంటి అంటే, స్టార్రీ నైట్, అట్లాస్ వైట్, రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్ రూఫ్ తో రేంజర్ ఖాకీ, అబిస్ బ్లాక్, షాడో గ్రే మరియు అబిస్ బ్లాక్ రూఫ్ తో షాడో గ్రే. ముఖ్యంగా చెప్పాలంటే, తరువాత పేర్కొన్న మూడు ఎక్స్‌టీరియర్ కలర్లను హ్యుందాయ్ కొత్తగా తీసుకువచ్చింది.
ఎక్స్‌టీరియర్ పరంగా ఇందులోని మార్పుల గురించి చెప్పాలంటే, ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్లో ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్ల వంటి బ్లాక్డ్-అవుట్ అంశాలు, 15-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, హ్యుందాయ్ లోగో మరియు ఎక్స్‌టర్ బ్యాడ్జి, మరియు కారుపై ‘Knight’ అనే సింబల్ (చిహ్నం) వంటివి ఉన్నాయి. దీని గురించి ఇంకా చెప్పాలంటే, ఈ ఎస్‍యూవీ ఫ్రంట్ మరియు రియర్ బంపర్లపై, టెయిల్ గేట్, మరియు బ్రేక్ కాలిపర్స్ పై రెడ్ యాక్సెంట్స్ ని పొందింది.
ఇంకా దీని ఇంటీరియర్ విషయానికి వస్తే, క్యాబిన్ బ్లాక్ కలర్లో రాగా, ఇది స్టిచింగ్ పై రెడ్ యాక్సెంట్స్ ఫినిషింగ్, ఫుట్ వెల్ లైటింగ్, మెటల్ స్కఫ్ ప్లేట్స్, రెడ్ స్టిచింగ్ తో ఫ్లోర్ మ్యాట్, మరియు స్పెషల్ ‘Knight’ థీమ్ సీట్ అప్హోల్స్టరీని కలిగి ఉంది.
మెకానికల్ గా, హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ లోని ఇంతకు ముందు లాగే 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సులతో జతచేయబడి వచ్చింది. ఎక్స్‌టర్ లోని మోటార్ 81bhp మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
కొత్త హ్యుందాయ్ ఎక్స్‌టర్ నైట్ ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద టేబుల్ లో ఇవ్వబడ్డాయి:
ట్రాన్స్‌మిషన్ | వేరియంట్ | ఎక్స్-షోరూమ్ ధరలు |
మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ | SX | రూ. 8. 38 లక్షలు |
SX డ్యూయల్-టోన్ | రూ. 8.62 లక్షలు | |
SX (O) కనెక్ట్ | రూ. 9.71 లక్షలు | |
SX (O) డ్యూయల్-టోన్ కనెక్ట్ | రూ. 9.86 లక్షలు | |
ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ | SX | రూ. 9.05 లక్షలు |
SX డ్యూయల్-టోన్ | రూ. 9.30 లక్షలు | |
SX (O) కనెక్ట్ | రూ. 10.15 లక్షలు | |
SX (O) డ్యూయల్-టోన్ కనెక్ట్ | రూ. 10.43 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్