- మూడు వేరియంట్‌లలో అందించబడిన హై - సిఎన్జి డ్యుయో
- స్పేర్ వీల్‌ను మిస్ అవుతున్న మోడల్
హ్యుందాయ్ ఇండియా ఇటీవలే ఎక్స్‌టర్ ట్విన్ సిఎన్జి సిలిండర్ వెర్షన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఎక్స్‌టర్ హై- సిఎన్జి డ్యూయో - S, SX మరియు SX నైట్ ఎడిషన్ మూడు వేరియంట్లలో అందించబడుతోంది. దీనిని రూ.8.5 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, లాంచ్ తర్వాత, ఈ మోడల్ ఇండియాలోని అన్ని డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
డ్యూయల్ సిఎన్‍జి సిలిండర్ తో కూడిన ఎక్స్‌టర్ టాటా వలె అదే ట్విన్ సిఎన్జి సిలిండర్ టెక్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే, ఇందులో 60-లీటర్ కెపాసిటీ గల ఒక సిఎన్‌జి సిలిండర్ కిబదులుగా, ఈ మోడల్‌లో ఒక్కొక్కటి 30-లీటర్ కెపాసిటీతో కూడిన (ట్విన్-సిలిండర్స్) రెండు చిన్న సిలిండర్లు ఉంటాయి. ఈ సిలిండర్ల వల్ల కారు బూట్ లోపల ఎక్కువ స్థలాన్ని ఆదా చేయవచ్చు. కాబట్టి, చివరికి మిగిలిన స్పేస్ లగేజ్ కోసం ఎక్కువ బూట్ స్పేస్‌గా ఉపయోగపడుతుంది. అయితే, దీని కారణంగా, ఎక్స్‌టర్ హై-సిఎన్జి డ్యుయో వెర్షన్‌లు స్పేర్ వీల్‌ను మిస్ అవుతుండగా, ఇందులో స్పేర్ వీల్ కి బదులుగా టైర్ పంక్చర్ రిపేర్ కిట్ అందుబాటులోకి వచ్చింది.
మెకానికల్‍గా, ఎక్స్‌టర్ 1.2-లీటర్ 4-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో కేవలం 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి అందించబడింది. అంతే కాకుండా, సిఎన్‍జి వెర్షన్ లో,ఈ మోటార్ మాన్యువల్ గేర్‌బాక్స్‌కు మాత్రమే జత చేయబడింది. ముఖ్యంగా చెప్పాలంటే, ఎక్స్‌టర్ న్యూ సిఎన్‍జి టెక్ సిఎన్‍జి మోడ్‌లో సగటున చూస్తే 27.1కిలోమీటర్ల/కిలో మైలేజీని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప