- మూడు వేరియంట్లలో అందించబడుతున్న ఎక్స్‌టర్ సిఎన్‍జి డ్యూయో
- సిఎన్‍జి సిస్టంపై మూడేళ్ళ పాటు వారంటీ
హ్యుందాయ్ ఇండియా ఇప్పుడు టాటా మోటార్స్ ఫాలో అవుతున్న స్ట్రాటజీని అమలుపరుస్తుంది. టాటా కంపెనీ కొత్తగా ఇన్నోవేటివ్ ట్విన్ సిఎన్‍జి సిలిండర్ ట్యాంక్ టెక్ ని లాంచ్ చేయగా, దానిని ఫాలో అవుతూ ఎక్స్‌టర్ ఇండియాలో సిఎన్‍జి సిస్టంని తీసుకువచ్చింది. ఎక్స్‌టర్ సిఎన్‍జి డ్యూయోని రూ.8.50 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో తీసుకురాగా, ఇది ఇప్పుడు S, SX మరియు లేటెస్టుగా లాంచ్ అయిన SXనైట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
మెకానికల్ గా, ఎక్స్‌టర్ 1.2-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడి రాగా, కొత్త సిఎన్‍జి సిస్టంని ఇందులో కొనసాగిస్తుంది. అయితే, సింగిల్ సిఎన్‍జి సిలిండర్ ఫిట్ మెంట్ లాగా కాకుండా, సిఎన్‍జి డ్యూయో ట్విన్ సిలిండర్లను పొందగా, ఇంటిగ్రేటెడ్ ఈసీయూతో సిఎన్‍జిని రెండు ఫ్యూయల్ ఆప్షన్ల ద్వారా పెట్రోల్ నుంచి సిఎన్‍జికి, సిఎన్‍జి నుంచి పెట్రోల్ కి మార్చవచ్చు. ఈ కండీషన్లో, ఎక్స్‌టర్ మోడల్ 60 లీటర్ల సిఎన్‍జి కెపాసిటీ సహాయంతో 27.1కి.మీ./కేజీ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.
ఎక్స్‌టర్ హై-సిఎన్‍జి డ్యూయో పరిచయంపైహ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ “హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ స్థిరమైన మరియు వినూత్నమైన మొబిలిటీ పరిష్కారాలను అందించడానికి కట్టుబడి ఉంది. డ్యూయల్-సిలిండర్ సిఎన్‍జి టెక్నాలజీతో మా ఎంట్రీ ఎస్‍యూవీ- ఎక్స్టర్ను లాంచ్ చేసినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. హై ఫ్యూయల్ ఎఫిషియన్సీ, విశాలమైన బూట్ స్పేస్ మరియు ఈ ఎస్‍యూవీ వివిధ షేడ్స్ లో అందించబడింది. నమ్మకమైన మరియు సమర్థవంతమైన వెహికిల్ కోసం వెతుకుతున్న కస్టమర్లను ఎక్స్‌టర్ హై-సిఎన్‍జి డ్యూయో అమితంగా ఆకర్షిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.' అని పేర్కొన్నారు.
వేరియంట్ వారీగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ సిఎన్‍జి డ్యూయో ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:
వేరియంట్లు | ఎక్స్-షోరూం ధర |
S | రూ. 8,50,300 |
SX | రూ. 9,23,300 |
SX నైట్ ఎడిషన్ | రూ. 9,38,200 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్