- ఈ మధ్యే రూ.16,000 వరకు పెరిగిన ధరలు
- ప్రస్తుతం 18 నెలలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
ఎంట్రీ లెవెల్ ఎస్‍యువి హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఇండియాలో 75 వేల యూనిట్స్ బుకింగ్ మైల్ స్టోన్ ని సాధించి, త్వరలో ఒక లక్ష బుకింగ్ క్లబ్ లో చేరడానికి సిద్ధంగా ఉంది. తాజాగా పెరిగిన ధరతో, ఇది ప్రస్తుతం రూ.6 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో 7 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఈ కొరియన్ ఆటోమేకర్ తాజాగా సెప్టెంబర్ 2023లో 8,000 ఎక్స్‌టర్ యూనిట్స్ ని విక్రయించింది. అదే నెలలో ఈ బ్రాండ్ సబ్-4 మీటర్ ఎస్‍యువి విభాగంలో 65,000 బుకింగ్స్ సాధించింది. హ్యుందాయ్ ఎక్స్‌టర్ తో పోటీ పడుతున్న టాటా పంచ్ సెప్టెంబర్ నెలలో మొత్తంగా 13,000 పైగా యూనిట్ సేల్స్ సాధించింది.
ఎక్స్‌టర్ ఎస్‍యువిని 7 వేరియంట్స్ లో పొందవచ్చు – అవి ఏంటి అంటే EX, EX (O), S, S (O), SX, SX (O), మరియు SX (O) కనెక్ట్. దీని 1.2 లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఒక ఎఎంటి యూనిట్ తో జత చేయబడి ఉంటుంది. అలాగే ఇది సిఎన్‍జి పవర్డ్ వేరియంట్స్ లో కూడా లభించనుంది. అవి ఏంటి అంటే, ఎస్ సిఎన్‍జి మరియు ఎస్ఎక్స్ సిఎన్‍జి.
తాజాగా, అక్టోబర్ 2023లో హ్యుందాయ్ ఎక్స్‌టర్ కు సంబంధించిన వెయిటింగ్ పీరియడ్ వివరాలను మేము కలిగి ఉన్నాము. ప్రస్తుతం ఈ ఎస్‍యువిపై 18 నెలల వెయిటింగ్ పీరియడ్ ను హ్యుందాయ్ కొనసాగిస్తుంది. ఈ ఎస్‍యువిని కొనుగోలు చేయాలంటే అప్పటి వరకు కస్టమర్స్ వేచి ఉండక తప్పదు. వేరియంట్ వారీగా వెయిటింగ్ పీరియడ్ వివరాలను తెలుసుకోవాలనుకుంటే మా కార్‌వాలే వెబ్ సైట్ ని తప్పక సందర్శించండి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్