- అత్యధిక వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉన్న క్రెటా డీజిల్ వేరియంట్స్
- రూ. 11 లక్షలతో ప్రారంభమైన ధరలు
హ్యుందాయ్ ఇండియా ఇటీవలే ఇండియాలో క్రెటా ఎస్‌యువి యొక్క పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది. దీంతో, మార్చి 2024లో పాపులర్ ఎస్‌యువి యొక్క స్టాండర్డ్ వెర్షన్ వెయిటింగ్ పీరియడ్ మరింత తగ్గింది.
హ్యుందాయ్ క్రెటా E, EX, S, S(O), SX, SX టెక్ మరియు SX(O) అనే 7 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, దీనిని రూ. 11 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. దీని డెలివరీ టైమ్‌లైన్‌ల విషయానికొస్తే, ఎస్‌యువియొక్క పెట్రోల్ వేరియంట్‌లపై 12 నుండి 18 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, మరోవైపు, డీజిల్ వేరియంట్‌లపై బుకింగ్ చేసుకున్న రోజు నుండి 16 నుండి 22 వారాల వరకు మాక్సిమమ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది.
ఈ వెయిటింగ్ పీరియడ్ తాత్కాలికంగా ఉండగా, కస్టమర్ ఎంచుకునే వేరియంట్, పవర్‌ట్రెయిన్ మరియు కలర్ ఆప్షన్‌ను బట్టి ఇది మారుతుంది. అలాగే, డీలర్‌షిప్, ప్రాంతం మరియు స్టాక్ లభ్యత వంటి ఇతర వివిధ కారణాలపై ఆధారపడి మారవచ్చు . కాబట్టి, మీకు కావాల్సిన మరింత ముఖ్యమైన సమాచారాన్ని పొందడానికి మీ సమీపంలోని అధికారిక డీలర్‌షిప్‌ను సంప్రదించవలసిందిగా మేము కోరుతున్నాము.
క్రెటా మూడు ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. అవి, - 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్. ఈ ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐఎంటి, ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్, సివిటి మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో జత చేయబడ్డాయి. ముఖ్యంగా, క్రెటా టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్‌తో (క్రెటా N లైన్‌కు మాత్రమే కాకుండా) డిసిటి యూనిట్‌తో పాటు ఇటీవల లాంచ్ అయిన N లైన్ ఇటరేషన్ కూడా వీటిని షేర్ చేసుకున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప