- ఇండియాలో రూ.11 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
- N లైన్ వేరియంట్లలో కూడా క్రెటాను పొందే అవకాశం
2024 హ్యుందాయ్ క్రెటా దేశవ్యాప్తంగా జనవరి 18న లాంచ్ అయింది. లాంచ్ జరిగి మూడు నెలలు గడవక ముందే కియా సెల్టోస్ తో పోటీపడుతున్న ఈ మోడల్ 80 వేలకు పైగా బుకింగ్స్ అందుకుంది. ఇంకా చెప్పాలంటే, ఈ హ్యుందాయ్ క్రెటా 2015లో లాంచ్ అవ్వగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం సేల్స్ పరంగా 10 లక్షలకు కార్లను విక్రయించి ఈ ఎస్‍యూవీ సరికొత్త మైల్‍స్టోన్‍ని క్రియేట్ చేసిందని తాజాగా హ్యుందాయ్ బ్రాండ్ ప్రకటించింది.
క్రెటాను హ్యుందాయ్ కంపెనీ E, EX, S, S(O), SX, SX టెక్, మరియు SX(O) అనే 7 వేరియంట్లలో అందిస్తుంది. కస్టమర్లు ఈ 5-సీటర్ ఎస్‍యూవీని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో మొత్తం 6 మోనోటోన్స్ మరియు ఒక డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ నుండి ఎంచుకోవచ్చు. ఇందులో 1.5-లీటర్ ఎన్ఎ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్, మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. అలాగే ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులు 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఐవిటి, 6-స్పీడ్ ఆటోమేటిక్, మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి.
తాజాగా, ఆటోమేకర్ క్రెటా N లైన్ అనే పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ వెర్షన్ ఎస్‍యూవీని పరిచయం చేసింది. ఇది N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండగా, ఈ ఎస్‍యూవీ దాని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ సహాయంతో 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు ఈ క్రెటా N లైన్ కారును రూ.25,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు, అలాగే దీని ధరలు రూ.16.82 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమయ్యాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్