- 60వేల కంటే ఎక్కువ బుకింగ్‌లను పొందిన క్రెటా ఫేస్‌లిఫ్ట్
- ఇండియాలో రూ. 11లక్షలు నుండి ప్రారంభమైన ధరలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ 5 సీటర్ ఎస్‌యువి, క్రెటా, ఇండియాలో 10 లక్షల యూనిట్ల ఉత్పత్తిమైలురాయిని అధిగమించినట్లు ప్రకటించింది. 2015లో లాంచ్ అయినప్పటి నుండి ఎనిమిది సంవత్సరాలలోనే ఈ రికార్డును సాధించింది. అలాగే, ఇది ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన మిడ్-సైజ్ ఎస్‌యువిలలో ఒకటిగా కొనసాగుతోంది. దేశీయ విక్రయాల తో పాటు, ఆటోమేకర్ క్రెటా యొక్క 2.8 లక్షల యూనిట్లను అంతర్జాతీయ మార్కెట్‌కు ఎగుమతి చేసింది.
ప్రస్తుతం, హ్యుందాయ్, కియా సెల్టోస్ కు పోటీగా ఉన్న దీనిని పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ లో 7 వేరియంట్‌లలో అందిస్తోంది. ఈ మోడల్ రేంజ్ రూ. 11 లక్షల నుంచి రూ. 20.15 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)వరకు ధరలు ఉన్నాయి. అంతేకాకుండా, ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ వంటి వాటితో పోటీ పడుతుంది.
ఈ మైలురాయిపై వ్యాఖ్యానిస్తూ, హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్, సిఓఓ, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ, “హ్యుందాయ్ క్రెటా భారతీయ కస్టమర్ల హృదయాలను దోచుకున్న ఈ బ్రాండ్ మరియు భారతదేశాన్ని ‘లివ్ ది ఎస్‌యువి లైఫ్’గా మార్చింది. భారతీయ రోడ్లపై ఒక మిలియన్ క్రెటాతో, 'క్రెటా' తిరుగులేని ఎస్‌యువిగా ప్రసిద్ధి చెందినట్లు బ్రాండ్ ప్రకటించింది. ఇటీవల లాంచ్ అయిన కొత్త హ్యుందాయ్ క్రెటా కూడా కస్టమర్ల నుంచి అధిక స్పందనను పొందుతుందని, ప్రకటించినప్పటి నుండి 60వేల బుకింగ్‌లను దాటింది. అలాగే, క్రెటాపై మా కస్టమర్‌లు చూపిన ప్రేమ మరియు నమ్మకానికి మేము చాలా కృతజ్ఞులమై ఉన్నాము. విప్లవాత్మక సాంకేతికతలను పరిచయం చేయడంలో ముందున్న వారిగా, మేము పరిశ్రమలోని విభాగాల్లో కొత్త మైలురాళ్లను మరియు ఆటో ఇండస్ట్రీలో ఇదే విధమైన బెంచ్ మార్కును కొనసాగిస్తాము ”అని తెలిపారు.