- పెట్రోల్ మరియు డీజిల్ వెర్షన్లలో లభించనున్న క్రెటా
- మరికొన్ని వారాల్లో పరిచయం అయ్యే అవకాశం
ఇటీవల సాధారణమైన మిడ్-సైజ్ ఎస్‍యూవీ సెగ్మెంట్‌లో పోటీగా కొన్ని కూపే ఎస్‍యూవీల రాకతో, హ్యుందాయ్ కంపెనీ క్రెటా లో ఒక సరికొత్త అప్‌డేటెడ్ పై నమ్మకంతో పని చేస్తుంది. ఇండియాలో కొరియన్ బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ మోడల్ స్పెషల్ ఎడిషన్ హోమోలోగేట్ చేయబడింది. అలాగే, ఇది త్వరలోనే లాంచ్ కానున్నట్లు అధికారిక పత్రాలు వెల్లడిస్తున్నాయి.
డాక్యుమెంట్‌ల ప్రకారం చూస్తే, క్రెటా SE లేదా స్పెషల్ ఎడిషన్ కారు S(O) మరియు SX(O) అనే రెండు వేరియంట్‌లలో అందించబడుతుంది. ప్రస్తుతానికి ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనప్పటికీ, ఈ స్పెషల్ ఎడిషన్ వెర్షన్ ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ భాగాలలో చిన్న చిన్న డిజైన్లను పొందుతుందని చెప్పవచ్చు.
హుడ్ కింద, కొత్త క్రెటా SE 1.5-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌తో అందించబడుతుంది. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, 6-స్పీడ్ మాన్యువల్, ఐవిటి మరియు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లుతో ఉంటాయి. ఈ ఆఫర్‌ను పండుగ సీజన్‌లో ప్రవేశపెట్టడం వల్లన ఇప్పటికే కొనసాగుతున్న క్రెటా విక్రయాలు కూడా మరింతగా పెరుగుతాయని భావిస్తున్నాం.
అనువాదించిన వారు: రాజపుష్ప