- రెండు వేరియంట్లలో అందించబడనున్న కొత్త క్రెటా
- 11 మార్చి, 2024న ధరలు ప్రకటించే అవకాశం
హ్యుందాయ్ ఇండియా క్రెటా N లైన్ ని 11 మార్చి, 2024న ప్రదర్శించడమే కాకుండా దీనికి సంబంధించిన ధరలను కూడా వెల్లడించనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా క్రెటా N లైన్ యొక్క అధికారిక బుకింగ్స్ ప్రారంభమవగా, కేవలం రూ.25,000 బుకింగ్ అమౌంట్ తో దీనిని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు, మనం దీని లాంచ్ కు ముందే, పెర్ఫార్మెన్స్-బేస్డ్ హ్యుందాయ్ క్రెటా యొక్క వెయిటింగ్ పీరియడ్ మరియు పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మాకు అందిన సమాచారం ప్రకారం, హ్యుందాయ్ క్రెటా N లైన్ పై లాంచ్ తేదీ నుండి 5-8 నెలల వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది. ఈ ఎస్యూవీ యొక్క డెలివరీ 2024 సంవత్సరం మే నెల 15వ తేదీ తర్వాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కస్టమర్లు క్రెటా N లైన్ ని ఇప్పుడే ఆర్డర్ చేస్తే వారికి అధిక ప్రాధాన్యత ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
హ్యుందాయ్ క్రెటా N లైన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. దీని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిసిటి గేర్ బాక్సుతో జతచేయబడవచ్చు. ఈ మోటార్ 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్