- ఇండియాలో మార్చి 11న క్రెటా N లైన్ ధరల ప్రకటన
- 1.5-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో రానున్న నయా క్రెటా మోడల్
హ్యుందాయ్ ఇండియా మార్చి 11న క్రెటా N లైన్ ను లాంచ్ చేయనుంది, కానీ దాని కంటే ముందుగా కొత్త క్రెటా N లైన్ యొక్క బుకింగ్స్ ని లేటెస్ట్ గా ప్రారంభించింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు కేవలం రూ.25,000 బుకింగ్ అమౌంట్ చెల్లించి తమ కారును బుక్ చేసుకోవచ్చు.
ఈ సంవత్సరం మేము ప్రత్యేకంగా రిపోర్టు చేసిన విధంగానే, కొత్త హ్యుందాయ్ క్రెటా N లైన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఇక కలర్ల విషయానికి వస్తే, అబిస్ బ్లాక్ పెర్ల్, అట్లాస్ వైట్ మరియు టైటాన్ గ్రే మ్యాట్ కలర్లలో రానుంది. అలాగే ఇది అట్లాస్ వైట్, షాడో గ్రే మరియు థండర్ బ్లూ వంటి డ్యూయల్-టోన్ కలర్లు కూడా ఉన్నాయి, ఇవన్నీ అబిస్ బ్లాక్ రూఫ్‌తో జత చేయబడ్డాయి.
హుడ్ కింద, 2024 క్రెటా N లైన్ లోని 1.5-లీటర్, 4-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ 158bhp మరియు 253Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటార్ ప్రస్తుతం స్టాండర్డ్ క్రెటాలో 7-స్పీడ్ డిసిటి యూనిట్ తో మాత్రమే అందించబడింది. N లైన్ ఇటరేషన్లో వస్తున్నప్పటికీ, 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో అందించడంతో ఇది ప్రత్యేకంగా నిలిచింది. క్రెటా N లైన్‌ని సాధారణ వెర్షన్‌తో పోల్చి చూస్తే ఇది ఎంత ప్రత్యేకంగా ఉందనే విషయాన్ని మీరు తెలుసుకోవడానికి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా కార్వాలే వెబ్సైట్లో చదవగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్