- 11 మార్చి, 2024న ధరలు ప్రకటన
- ఇది ఇండియాలో మూడవ ఎన్ లైన్ మోడల్
దేశవ్యాప్తంగా సెలెక్ట్ చేసిన హ్యుందాయ్ డీలర్‌షిప్‌లు వద్ద రాబోయే క్రెటా ఎన్ లైన్ ఆర్డర్‌లను ఇప్పటి నుండే అంగీకరించడం ప్రారంభించాయి. అలాగే, ఇటీవల లాంచ్ అయిన ఈ క్రెటా ఫేస్‌లిఫ్ట్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ యొక్క ధరలు 11 మార్చి, 2024న ప్రకటించబడతాయి. క్రెటా ఎన్ లైన్ ఎస్‌యువిని కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకునే కస్టమర్‌లు రూ.20,000 నుండి రూ. 25,000 వరకు టోకెన్ అమౌంట్ మొత్తం చెల్లించి తమ పేరున బుక్ చేసుకోవచ్చు. అయితే, ఈ బ్రాండ్ వెబ్ పోర్టల్ (వెబ్ సైట్) ద్వారా అధికారిక బుకింగ్స్ చేసుకొనేలా ఇంకా బుకింగ్ లను హ్యుందాయ్ ప్రారంభించలేదు.
రాబోయే హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ N8 మరియు N10 అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. మెకానికల్‍గా చూస్తే, ఇది ఒకేఒక్క 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అమర్చబడి ఉండనుంది, ఇది 158bhp మరియు 253Nm మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇందులో ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ విషయానికొస్తే, క్రెటా యొక్క ఎన్ లైన్ వెర్షన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్ రెండింటిలోనూ అందించబడనుంది.
వాస్తవంగా చెప్పాలంటే, వెన్యూ మరియు i20 ఎన్ లైన్ మాదిరిగానే, ఈ హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ రీడిజైన్ చేయబడి ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌తో స్పోర్టియర్ మరియు మరింత స్టైలింగ్‌ను పొందుతుంది. ఇది రెడ్ కలర్ లో సిగ్నేచర్ థండర్ బ్లూ కలర్‌తో సహా కొత్త పెయింట్ కూడా పొందనుంది. అంతేకాకుండా, దీని క్యాబిన్ పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్‌లో అద్భుతమైన రెడ్ స్టిచింగ్ మరియు వివిధ చోట్ల ఇన్‌సర్ట్‌లతో కప్పబడి ఉండనుంది.
ఫీచర్ పరంగా చూస్తే, ఈ క్రెటా ఎన్ లైన్ ట్విన్ డిస్‌ప్లే సెటప్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, డ్రైవింగ్ మోడ్స్, ఏడీఏఎస్ సూట్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు యాంబియంట్ లైటింగ్‌తో సహా మరిన్ని టెక్ ఫీచర్లతో లోడ్ అవ్వనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప