ఈ వారం ప్రారంభంలో, హ్యుందాయ్ అధికారికంగా క్రెటా N లైన్ ఎస్‌యువి యొక్క క్యాబిన్ వివరాలను అధికారికంగా లాంచ్ చేయడానికి ముందే వెల్లడించింది. ఈ రాబోయే ఎస్‌యువి యొక్క టాప్ ఎక్స్‌టీరియర్ హైలైట్‌లను మేము ఇప్పటికే లిస్ట్ చేసాము, ఈ కథనంలో మేము క్రెటా N లైన్ అన్ని ఇంటీరియర్ హైలైట్‌లను వ్రాసాము. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
డాష్‌బోర్డ్
హ్యుందాయ్ క్రెటా N లైన్ లో డ్యాష్‌బోర్డ్ లేఅవుట్‌ను మాత్రమే కాకుండా థీమ్‌ను కూడా మార్చింది. ఇది రెడ్ యాక్సెంట్స్ మరియు రెడ్ యాంబియంట్ లైటింగ్ తో క్యాబిన్ లోపల పూర్తిగా బ్లాక్ కలర్ ను పొందుతుంది. అంతేకాకుండా, ఇది రెడ్ స్టిచింగ్ లెథెరెట్ తో చుట్టబడిన గేర్ లీవర్ ను పొందుతుంది.
N- లైన్ బ్యాడ్జింగ్
క్రెటా ఎన్ లైన్‌ని స్టాండర్డ్ వేరియంట్ నుండి వేరుగా కనిపించేలా చేసేదే N లైన్ బ్యాడ్జింగ్. దీని లోపలి భాగంలో , స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్ మరియు ముందు సీట్లపై ‘N లైన్’ స్పెసిఫిక్ బ్యాడ్జింగ్‌ను మీరు చూడవచ్చు.
సీట్ అప్హోల్స్టరీ
ఎస్‌యువి యొక్క స్పోర్టియర్ ఇటరేషన్ రెడ్ స్టిచింగ్ మరియు ముందు సీట్లపై 'N లైన్' బ్యాడ్జ్‌తో బ్లాక్ లెథెరెట్ సీట్స్ పొందుతుంది. ఇది 8-వే పవర్డ్ డ్రైవర్ సీట్ మరియు వెంటిలేటెడ్ ముందు సీట్లను కూడా పొందుతుంది.
ఫీచర్స్
ఫీచర్ల విషయానికొస్తే, హ్యుందాయ్ క్రెటా N లైన్ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, డ్రైవ్ మోడ్స్, 70+ బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్స్ మరియు లెవల్ 2 ఏడీఏఎస్ సేఫ్టీ సూట్ వంటి ఫీచర్లతో రానుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప